ఝార్ఖండ్ ఎన్నికల ప్రచారంలో రాహుల్ గాంధీ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై నివేదిక సమర్పించాలని కేంద్ర ఎన్నికల సంఘం.. ఝార్ఖండ్ ఎన్నికల అధికారులను ఆదేశించింది. గొడ్డా ప్రచార ర్యాలీలో ప్రసంగించిన రాహుల్.. మహిళలపై పెరుగుతున్న అత్యాచారాల విషయంలో మోదీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ప్రధాని మోదీ భారత్‌ను 'మేక్ ఇన్ ఇండియా'గా కాకుండా 'రేప్ ఇన్ ఇండియా'గా మార్చారని ఆరోపించారు.
రాజకీయ ప్రత్యర్థులను లక్ష్యంగా చేసుకోవడానికి అత్యాచారాలను సాధనంగా ఉపయోగించుకున్నారని భాజపా నాయకులు రాహుల్‌పై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఆయనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీనిపై విచారణ చేపట్టింది ఈసీ. రాహుల్ వ్యాఖ్యలపై వాస్తవిక నివేదిక సమర్పించాలని ఝార్ఖండ్ ఎన్నికల అధికారులను ఆదేశించింది.
ఇదీ చూడండి: బంగాల్లో వరుసగా నాలుగో రోజూ 'పౌర' ప్రకంపనలు