ETV Bharat / bharat

విదేశాల్లోని భారతీయులకు ఓటుహక్కు!

author img

By

Published : Dec 1, 2020, 7:06 PM IST

విదేశాల్లోని భారతీయులకూ పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం కల్పించాలని కేంద్ర ఎన్నికల సంఘం ప్రతిపాదించింది. ఈమేరకు న్యాయశాఖకు లేఖ రాసింది.

EC proposes extending postal ballot facility for eligible overseas Indians
విదేశాల్లోని భారతీయులకు ఓటు హక్కు!

ఓటింగ్​ శాతాన్ని పెంచేందుకు, ప్రజాప్రతినిధులను ఎన్నుకోవడంలో పారదర్శకత పెంచేందుకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ) కసరత్తు ముమ్మరం చేసింది. విదేశాల్లోని అర్హత కలిగిన భారతీయులు ఓటు హక్కు వినియోగించుకునేలా పోస్టల్​ బ్యాలెట్​ సౌకర్యాన్ని విస్తరించాలని ప్రతిపాదించింది. ఈ మేరకు న్యాయ మంత్రిత్వశాఖ కార్యదర్శికి నవంబర్​ 27న లేఖ రాసింది. ఇటీవల కొన్ని రాష్ట్రాల్లో జరిగిన ఉపఎన్నికలు, బిహార్​ అసెంబ్లీ ఎన్నికల్లో పోస్టల్ బ్యాలెట్​ సౌకర్యాన్ని విజయవంతంగా అమలు చేయడం వల్ల విశ్వాసం పెరిగిందని పేర్కొంది.

రానున్న అసోం, బంగాల్​, కేరళ, తమిళనాడు, పుదుచ్చేరి రాష్ట్రాల్లోని అసెంబ్లీ ఎన్నికల్లో పోస్టల్ బ్యాలెట్ విధానం అమలు చేయడానికి కావాల్సిన సాంకేతిక, పరిపాలనపరమైన సదుపాయాలను సిద్ధం చేసుకున్నట్లు లేఖలో వెల్లడించింది ఈసీ. వచ్చే ఏడాది ఏప్రిల్-జూన్​ నెలల్లో ఆయా రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్నాయి.

వృద్ధులు, విదేశాల్లోని అర్హత ఉన్న భారతీయులు ఓటు హక్కు వినియోగించుకోలేకపోతున్నారని తెలిపింది ఎన్నికల సంఘం. వారూ ఓటు హక్కు వినియోగించుకునేలా పోస్టల్​ బ్యాలెట్​ను విస్తరించాలనే ప్రతిపాదనలు వచ్చిన నేపథ్యంలో... ఈ ప్రతిపాదన చేస్తున్నట్లు ఈసీ వెల్లడించింది.

ఈసీ ప్రతిపాదనకు కేంద్రం ఆమోదం తెలిపితే విదేశాల్లోని భారతీయులు తమ ఓటు హక్కు వినియోగించుకోవచ్చు.

ఇదీ చూడండి: 'డబ్ల్యూటీఓ వల్లే సాగు చట్టాలు- ఇలా అయితే కష్టమే'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.