మక్కల్ నీది మయ్యమ్ పార్టీకి ఎన్నికల సంఘం బ్యాటరీ టార్చ్ గుర్తును కేటాయించింది. ఈ విషయాన్ని పార్టీ అధినేత కమల్ హాసన్ శుక్రవారం ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.
"మొత్తం 234 అసెంబ్లీ నియోజకవర్గాలకు వర్తించేలా ఎన్నికల సంఘం మా పార్టీకి టార్చ్‌లైట్ గుర్తును కేటాయించింది."
-కమల్ హాసన్, మక్కల్ నీది మయ్యమ్ పార్టీ అధినేత
2019లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లోనూ కమల్ పార్టీ ఇదే గుర్తుతో పోటీ చేసింది. అయితే 2021 ఎన్నికలకు టార్చ్‌లైట్ గుర్తును కేటాయించడానికి ఎన్నికల సంఘం మొదట తిరస్కరించింది. దీనిపై పార్టీ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించింది.
వెలుగును విస్తరిద్దాం
ఎన్నికల్లో పోటీచేసేందుకు తమ పార్టీకే టార్చ్‌లైట్ గుర్తు దక్కడంపై కమల్‌హాసన్ హర్షం వ్యక్తంచేశారు. అణగారిన వర్గాల జీవన ప్రమాణాల మెరుగు కోసం పోరాటం చేసిన మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ పుట్టిన రోజు నాడు తమకు ఈ గుర్తును కేటాయించిన ఎన్నికల సంఘానికి, ఇందుకు సహకరించిన అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. వెలుగును విస్తరిద్దాం అని పేర్కొన్నారు.
ఇదీ చదవండి : సాగు చట్టాలపై సుప్రీం తీర్పును స్వాగతించిన కమల్