ETV Bharat / bharat

'సరైన తిండి తినకపోతే రూ.11 లక్షల కోట్లు ఖర్చు' - what is food security

ఆహార భద్రత అంశంలో అన్ని మంత్రిత్వ శాఖలు జోక్యం చేసుకోవాలని పిలుపునిచ్చారు కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్. అప్పుడే.. 'ఈట్​ రైట్ ఇండియా' ఉద్యమం విజయవంతం అవుతుందని అభిప్రాయపడ్డారు. అందరూ పోషకాల సంరక్షణవైపు పయనించాలని కోరారు.

Eat Right India Movement: Harsh Vardhan says need to move from food security to nutrition security
'ఈట్​ రైట్​ ఇండియా ఉద్యమంలో పోషకాహారమే కీలకం'
author img

By

Published : Oct 15, 2020, 6:37 PM IST

'ఈట్​ రైట్​ ఇండియా' ఉద్యమ లక్ష్యాలను చేరుకోవాలంటే.. ఆహార భద్రత నుంచి పోషకాల సంరక్షణ వైపు పయనించాలని కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్​ పేర్కొన్నారు. ఇతర మంత్రిత్వ శాఖలూ ఈ కార్యక్రమంలో భాగస్వాములై.. వ్యూహాత్మకంగా ముందుకు సాగాలని కోరారు.

రూ.11 లక్షల కోట్లు..
ఎఫ్​ఎస్​ఎస్​ఏ, ఇతర మంత్రిత్వ శాఖలకు చెందిన సీనియర్​ అధికారులతో మంత్రి హర్షవర్ధన్​ సమావేశమయ్యారు. 'ఈట్​ రైట్​ ఇండియా ఉద్యమం​'లో భాగంగా ప్రభుత్వం తలపెట్టిన విజన్​ 2050 అమలు తీరుపై చర్చించారు. దేశంలో సరైన ఆహారంలేని కారణంగా వచ్చే వ్యాధుల వల్లే అయ్యే ఖర్చు రూ.11 లక్షల కోట్లుగా ఉంటుందన్న అంచనాను ఈ సందర్భంగా గుర్తు చేశారు.

"ఆహార పదార్థాలకు సంబంధించిన.. ఉత్పత్తి, ప్రాసెసింగ్​, వృథా నివారణ వంటి అనేక దశలలో వివిధ మంత్రిత్వ శాఖలు జోక్యం చేసుకోవాలి. అప్పుడే 'ఈట్ రైట్ ఇండియా' ఉద్యమం విజయవంతమవుతుంది. వ్యవస్థీకృతమైన విధానాలతోనే ఆహార భద్రత సాధించగలం. అందరికీ ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందించగలం. "

--- హర్షవర్ధన్​, కేంద్ర ఆరోగ్య మంత్రి.

మహిళా శిశు సంక్షేమ శాఖ, వ్యవసాయ శాఖ, ఆహార శాఖ అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

ఇదీ చూడండి:మోదీ ఆస్తుల విలువ ఎంత పెరిగిందో తెలుసా?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.