దేశంలో కొద్ది రోజులుగా భూప్రకంపనలు పెరిగాయి. తాజాగా మణిపుర్‌లోని ఉఖ్రుల్ జిల్లాల్లో భూమి కంపించింది. దాదాపు నెల రోజుల వ్యవధిలోనే ఈ ప్రాంతంలో రెండుసార్లు భూకంపం రావడం వల్ల ప్రజల్లో భయాందోళనలు పెంచుతోంది.
భూకంప లేఖినిపై 4.3 తీవ్రత నమోదైనట్లు జాతీయ భూకంప అధ్యయన కేంద్రం(ఎన్సీఎస్) వెల్లడించింది. బుధవారం తెల్లవారుజామున 3.32 గంటల ప్రాంతంలో భూమి కంపించగా.. 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం కేంద్రీకృతమైనట్లు తెలిపింది. ఈ ఘటన వల్ల ఆస్తి, ప్రాణ నష్టం జరిగినట్లు ఇప్పటి వరకు ఎలాంటి సమాచారం అందలేదని అధికారులు తెలిపారు.
ఇటీవల సెప్టెంబర్ 1న ఉఖ్రుల్‌కు తూర్పున 55 కిలోమీటర్ల దూరంలో భూమి కంపించింది. రిక్టర్ స్కేలుపై 5.1 తీవ్రత నమోదైంది.
-
Earthquake of Magnitude:4.3, Occurred on 07-10-2020, 03:32:56 IST, Lat: 25.33 & Long: 94.44, Depth: 10 Km ,Location: Ukhrul, Manipur, for more information https://t.co/VtM3MtDZlB pic.twitter.com/UkOIgtLzwl
— National Centre for Seismology (@NCS_Earthquake) October 6, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">Earthquake of Magnitude:4.3, Occurred on 07-10-2020, 03:32:56 IST, Lat: 25.33 & Long: 94.44, Depth: 10 Km ,Location: Ukhrul, Manipur, for more information https://t.co/VtM3MtDZlB pic.twitter.com/UkOIgtLzwl
— National Centre for Seismology (@NCS_Earthquake) October 6, 2020Earthquake of Magnitude:4.3, Occurred on 07-10-2020, 03:32:56 IST, Lat: 25.33 & Long: 94.44, Depth: 10 Km ,Location: Ukhrul, Manipur, for more information https://t.co/VtM3MtDZlB pic.twitter.com/UkOIgtLzwl
— National Centre for Seismology (@NCS_Earthquake) October 6, 2020
ఇదీ చూడండి: లేహ్‌లో భూకంపం.. 5.1 తీవ్రత నమోదు