ఇప్పటికే పలువురు నాయకులు మహమ్మారి కరోనా బారిన పడగా... తాజాగా కర్ణాటక ఉపముఖ్యమంత్రి అశ్వత్ నారాయణ్‌కు కొవిడ్ పాజిటివ్‌గా తేలింది. అసెంబ్లీ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో ముందు జాగ్రత్తగా పరీక్షలు చేయించుకున్న క్రమంలో వైరస్ సోకినట్లు తేలింది. దీంతో ఆయన స్వీయ నిర్బంధంలోకి వెళ్లినట్లు తెలిపారు. అయితే ఎటువంటి లక్షణాలు లేవని వెల్లడించారు. తనతో సన్నిహితంగా మెలిగినవారు తప్పనిసరిగా పరీక్షలు చేయించుకోవాలని సూచించారు.
ప్రతిపక్ష నేతకు వైరస్
ఉత్తరాఖండ్ ప్రతిపక్ష నేత ఇందిరా హృదయేశ్ కరోనా బారిన పడ్డారు. ఈ మేరకు రాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు ధీరేంద్ర ప్రతాప్ తెలిపారు. ఆమె ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరినట్లు చెప్పారు. దీంతో రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు ప్రీతం సింగ్ స్వీయ నిర్బంధంలోకి వెళ్లినట్లు సమాచారం.
ఇదీ చూడండి: 'శ్రామిక్ రైళ్లల్లో 97మంది కూలీలు మృతి'