ETV Bharat / bharat

కరోనా కేసులు డబుల్​.. ఎన్ని రోజుల్లో తెలుసా? - cobas testing machine

దేశంలో కరోనా కేసుల వ్యాప్తి వేగం తగ్గినట్లు చెప్పారు కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్​. కేసుల రెట్టింపు సమయం 11.1 నుంచి 13.9 రోజులకు పెరిగినట్లు స్పష్టం చేశారు. కరోనా పరీక్షలకు నూతనంగా రూపొందించిన కోబాస్​ 6800 యంత్రాన్ని దేశానికి అంకితం చేస్తున్నట్లు ప్రకటించారు.

Doubling time of COVID-19 cases slows down to 13.9 days
'కరోనా కేసుల రెట్టింపు సమయం 14 రోజలకు పెరిగింది'
author img

By

Published : May 14, 2020, 9:25 PM IST

దేశంలో కరోనా కేసుల రెట్టింపు సమయంలో మార్పు వస్తోంది. గతంలో కేసులు 'డబుల్​' అయ్యేందుకు 11.1 రోజులు పట్టగా... ప్రస్తుతం 13.9 రోజులు పడుతున్నట్లు చెప్పారు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి డా.హర్షవర్ధన్​. గడిచిన 24 గంటల్లో 14 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఒక్క కేసూ నమోదు కాలేదన్నారు. దేశంలో కరోనా మరణాల సంఖ్య 2,549కి చేరగా, పాజిటివ్ కేసుల సంఖ్య 78,003కు పెరిగినట్లు తెలిపారు.

గుజరాత్​, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, చండీగఢ్, ఛత్తీస్​గఢ్​, ఝార్ఖండ్​, అండమాన్​ నికోబార్​, అరుణాచల్​ ప్రదేశ్​, దాద్రా నగర్​ హవేలి, గోవా, మణిపుర్​, మేఘాలయ, మిజోరం, పుదుచ్చేరి, దమన్​ దయ్యూ, సిక్కిం, నాగలాండ్​, లక్ష్యద్వీప్​లలో గత 24 గంటల్లో సున్నా కేసులు నమోదయ్యాయి.

కోబాస్​ యంత్రం జాతికి అంకితం..

కరోనా పరీక్షలు వేగంగా చేసేందుకు స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన కోబాస్​ 6800 యంత్రాన్ని.. జాతికి అంకితం చేశారు కేంద్రమంత్రి. ఇది పూర్తిగా స్వయం చాలకమని, ఉన్నత స్థాయి ప్రమాణాలతో రూపొందినట్లు వివరించారు. జాతీయ అంటువ్యాధుల నియంత్రణ కేంద్రం(ఎన్​సీడీసీ) సందర్శన సందర్భంగా ఈ వివరాలు వెల్లడించారు డా.హర్షవర్ధన్​. కోబాస్​తో 24 గంటల్లోనే 1200 నమూనాలు పరీక్షించవచ్చన్నారు.

దేశంలో కరోనా టెస్టుల సామర్థ్యం లక్షకు చేరుకున్నట్లు చెప్పారు హర్షవర్ధన్​. ఇప్పటివరకు మొత్తం 20 లక్షల టెస్టులు పూర్తి చేసినట్లు తెలిపారు. దేశవ్యాప్తంగా 500కి పైగా ల్యాబ్​లు అందుబాటులో ఉన్నాయని.. వాటిల్లో 359 ప్రభుత్వం పరిధిలోనివని వివరించారు. కరోనాపై పోరాడుతున్న వీరులకు సెల్యూట్​ చేశారు.

దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో 3,722 కొత్త కేసులు నమోదయ్యాయి. 134 మంది మరణించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.