ETV Bharat / bharat

మరోసారి కనువిందు చేయనున్న దూరదర్శన్ సీరియల్స్ - చాణక్య

కరోనా ప్రభావంతో దేశంలో 21 రోజుల లాక్​డౌన్​ నడుస్తోంది. ఈ నేపథ్యంలో ప్రజలు విసుగు చెందకుండా ఉండేందుకు అపురూపమైన సీరియల్స్​ను మళ్లీ ప్రసారం చేసేందుకు సిద్ధమైంది దూరదర్శన్​. ఇప్పటికే ప్రముఖ సీరియల్ రామాయణాన్ని ప్రారంభించింది. ఇదే తరహాలో త్వరలోనే మరో కొన్ని సీరియల్స్​ను​ ప్రేక్షకుల ముందుకు తీసుకురానుంది.

Doordarshan brings back memories from Golden Era of television
ఇప్పుడు రామాయణం.. త్వరలోనే 'శక్తిమాన్​', 'చాణక్య'!
author img

By

Published : Apr 1, 2020, 9:48 AM IST

Updated : Apr 1, 2020, 10:12 AM IST

కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు ఇళ్లకే పరిమితమైన ప్రజలు అపురూపమైన పాత జ్ఞాపకాలను నెమరు వేసుకోవాలని భావిస్తున్నారు. ఇందుకు విశేష ప్రేక్షకాదరణ పొందిన నాటి టీవీ సీరియల్స్​ను మళ్లీ చూడాలని కోరుకుంటున్నారు. అలాంటి వారి కోసం ఇటీవల రామాయణంతో పాటు మరికొన్ని ధారావాహికల ప్రసారాలను ప్రారంభించిన దూరదర్శన్​ మరో కొన్ని సీరియల్స్​ను ప్రసారం చేసేందుకు సిద్ధమైంది.

ప్రజల విజ్ఞప్తి మేరకు

హిందీలో ప్రసారమైనా హిందీయేతర రాష్ట్రాల్లోనూ ప్రజాభిమానం సొంతం చేసుకున్న టీవీ సీరియల్స్​లో ముఖ్యమైనవి 'చాణక్య', 'శక్తిమాన్​'. వీటిని మళ్లీ ప్రసారం చేయాలని నెటిజన్ల విజ్ఞప్తులతో ట్విట్టర్ హోరెత్తిపోతుంది. ప్రజల కోరిక మేరకు ఈ సీరియల్స్​ను దూరదర్శన్​(డీడీ నేషనల్​) ప్రసారం చేయనుంది.

'చాణక్య'

విశేష ప్రజాదరణ పొందిన 'చాణక్య' సీరియల్​ 47 ఎపిసోడ్లను ప్రసారం చేసేందుకు దూరదర్శన్​ సిద్ధమైంది. చంద్రప్రకాశ్​ ద్వివేది దర్శకత్వం వహించిన ఈ సీరియల్​ను ప్రతి రోజు మధ్యాహ్నం ప్రసారం చేయాలని డీడీ భారతి నిర్ణయించింది. ఏప్రిల్​ మొదటి వారం నుంచే ఈ ధారావాహిక మళ్లీ ప్రారంభం కానుంది.

'ఉపనిషత్​​ గంగా'

చిన్మయ మిషన్ ట్రస్ట్​ నిర్మించిన 'ఉపనిషత్​​ గంగా' సీరియల్​ను ఏప్రిల్​ మొదటి వారం నుంచి ప్రసారం చేసేందుకు సన్నాహాలు చేస్తోంది డీడీ భారతి. 52 ఎపిసోడ్లు ఉన్న ఈ సీరియల్​కు చంద్రప్రకాశ్​ ద్వివేది దర్శకత్వం వహించారు.

'శక్తిమాన్​'

ముకేశ్​ ఖన్నా ప్రధానపాత్రలో నటించిన 'శక్తిమాన్​' సీరియల్ అపురూపమైన ప్రజాదరణ సొంతం చేసుకుంది. ఈ ధారావాహికను ప్రతి రోజు మధ్యాహ్నం 1 గంటకు.. గంట సేపు ప్రసారం చేసేందుకు డీడీ నేషనల్ నెట్​వర్క్​ సిద్ధమైంది.

'శ్రీమాన్​.. శ్రీమతి'

ఆద్యంతం నవ్వులు చిందించే 'శ్రీమాన్​.. శ్రీమతి' సీరియల్ ఏప్రిల్​ మొదటి వారం నుంచి ప్రారంభం కానుంది. ఇది ప్రతిరోజు మధ్యాహ్నం రెండు గంటలకు డీడీ నేషనల్​లో ప్రసారమవుతుంది. మార్కంద్​ అధికారి దీన్ని నిర్మించారు.

Doordarshan brings back memories from Golden Era of television
ఇప్పుడు రామాయణం.. త్వరలోనే 'శక్తిమాన్​', 'చాణక్య'!

'కృష్ణ కాళీ'

18 ఎపిసోడ్లు ఉన్న 'కృష్ణ కాళీ' సీరియల్​ను ప్రసారం చేసేందుకు డీడీ నేషనల్ సిద్ధమైంది. ప్రతి రోజు రాత్రి 8:30కు ఇది ప్రసారం కానుంది.

ఇప్పటికే ప్రారంభమైనవి..

ప్రజల విజ్ఞప్తి మేరకు ఇప్పటికే పలు సీరియల్ ప్రసారాలను​ ప్రారంభించింది డీడీ. వాటిలో ముఖ్యమైనవి..

'రామాయణం'

ప్రేక్షకులకు బుల్లితెరపై రాముడంటే అరుణ్​ గోవిల్​ అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. 'రామాయణం' సీరియల్ హిందీలో ప్రసారమైనప్పటికీ హిందీయేతర రాష్ట్రాల్లో ఎంతో ప్రజాభిమానం సొంతం చేసుకుంది. ఈ సీరియల్​ను ఈనెల 28 నుంచే డీడీ నేషనల్​లో ప్రతిరోజు ఉదయం 9, రాత్రి 9 గంటలకు ప్రసారం చేస్తున్నారు.

'మహాభారతం'

విశేష ప్రజాభిమానం సొంతం చేసుకున్న మరో సీరియల్ 'మహాభారతం'. 97 ఎపిసోడ్లు ఉన్న ఈ సీరియల్​ను కూడా ప్రతి రోజు మధ్యాహ్నం 12కు, తిరిగి రాత్రి 7 గంటలకు ప్రసారం చేస్తున్నారు.

'వ్యోమకేశ్ బక్షి'

మరో హిట్​ సీరియల్​ 'వ్యోమకేశ్​ బక్షి'. 52 ఎపిసోడ్లు ఉన్న ఈ సీరియల్​ను ప్రతి రోజు ఉదయం 11 గంటలకు గంటపాటు ప్రసారం చేస్తున్నారు.

'సర్కస్​'

షారుక్ ఖాన్​ ముఖ్యపాత్రలో నటించిన సీరియల్​ 'సర్కస్​'. 19 ఎపిసోడ్లు ఉన్న ఈ సీరియల్​ రాత్రి 8 గంటలకు ప్రసారం చేస్తున్నారు.

'హమ్​ హేన్​ నా'

60 ఎపిసోడ్లు ఉన్న 'హమ్​ హేన్​ నా' సీరియల్​ మార్చి 28 నుంచి ప్రారంభమైంది. ప్రతి రోజూ రాత్రి 10 గంటలకు డీడీ నేషనల్​ నెట్​వర్క్​లో ప్రసారం చేస్తున్నారు.

వీటిని తప్పక చూపాల్సిందే

కేబుల్​ టెలివిజన్ నెట్​వర్స్క్​(రెగ్యులేషన్​) చట్టం ప్రకారం డీటీహెచ్​, కేబుల్​ ఆపరేటర్లు తప్పనిసరిగా అన్ని డీడీ ఛానెల్స్ (లోక్​సభ, రాజ్యసభ ఛానెళ్లతో పాటు) వినియోగదారులకు అందించాలి. ఏవైనా కారణాలు వల్ల వీటిని ప్రసారం చేయనట్లయితే సెక్షన్​ 11, 12, 18 ప్రకారం శిక్షార్హులవుతారు.

డీడీ ఛానెల్స్​ రాకుంటే..

వినియోగదారులకు డీడీ ఛానెళ్లు రానట్లయితే సమీపంలోని దూరదర్శన్​ కేంద్రానికి వెళ్లి లేదా డీడీపీబీ.ఐఎన్​ఎఫ్​ఓఆర్​ఎమ్​@జీమెయిల్​.కామ్​లో ఈ-మెయిల్​ ద్వారా ఫిర్యాదు చేయొచ్చు.

ఇదీ చదవండి: ఇకపై రైల్వే ఆసుపత్రుల్లోనూ వారికి చికిత్స

Last Updated : Apr 1, 2020, 10:12 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.