తమిళనాడు వేలూరు లోక్‌సభ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో ద్రవిడ మున్నేట్ర కళగం(డీఎంకే) విజయం సాధించింది. డీఎంకే అభ్యర్థి డీకే కథిర్ ఆనంద్ ఎనిమిది వేల ఓట్లకు పైగా మెజార్టీతో గెలుపొందారు. ఓట్ల లెక్కింపు ప్రారంభంలో అన్నాడీఎంకే అభ్యర్థి ఏసీ షణ్ముగం ఆధిక్యం కనబరిచినా గెలుపు డీఎంకే అభ్యర్థినే వరించింది.
వేలూరు లోక్‌సభ స్థానానికి సాధారణ ఎన్నికలతో పాటే ఏప్రిల్‌లో ఎన్నికలు జరగాల్సి ఉంది. అయితే ఈ నియోజకవర్గంలో భారీగా డబ్బు పట్టుబడినందున ఎన్నికలను వాయిదా వేసింది ఈసీ. ఫలితంగా ఈ నెల 5న ఉప ఎన్నిక నిర్వహించారు.
సాధారణ ఎన్నికల్లో 38 స్థానాలకుగాను డీఎంకే 37 స్థానాలు కైవసం చేసుకోగా, అన్నాడీఎంకే కేవలం ఒకే చోట విజయం సాధించింది. తాజాగా మరో స్థానం డీఎంకే ఖాతాలో చేరింది.