ETV Bharat / bharat

పట్టపగలే భాజపా నేత దారుణ హత్య - భాజపా నేత సతీశ్​ సింగ్​ హత్య

ఝార్ఖండ్​లో పట్టపగలే ఓ భాజపా నాయకుడ్ని ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు హత్యచేశారు. నడిరోడ్డుపై అందరూ చూస్తుండగానే తుపాకీతో కాల్చి.. అక్కడి నుంచి పరారయ్యారు.

BJP leader shot dead in Dhanbad
పట్టపగలే భాజపా నేత దారుణ హత్య
author img

By

Published : Aug 20, 2020, 4:43 PM IST

ఝార్ఖండ్​లో దారుణం జరిగింది. కారు దిగి రోడ్డుపై నడచుకుంటూ వెళ్తున్న ఓ భాజపా నాయకుడ్ని పట్టపగలే నడిరోడ్డుపై హత్య చేశారు దుండగులు.

ఇలా జరిగింది..

ధన్​బాద్​లోని బ్యాంక్​ మోర్​ ప్రాంతంలో భాజపా నగర ఉపాధ్యక్షుడు​ సతీశ్​ సింగ్​(40) కారు దిగి చరవాణిలో మాట్లాడుతూ నడుచుకుంటూ వెళ్తున్నారు. అదే సమయంలో ముఖానికి మాస్కులు కట్టుకొన్న ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు బైక్​పై ఆయన్ను అనుసరించారు. సతీశ్​ సింగ్​ తిరిగి చూసేలోగా తలపై కాల్చి పరారయ్యారు. తక్షణమే సతీశ్​ను ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.

స్థానిక సీసీటీవీలో రికార్డయిన దృశ్యాలు

ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు.. స్థానిక సీసీటీవీ కెమెరాలలో రికార్డయ్యాయి. వీటి ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. నిందితులను త్వరలోనే అరెస్ట్​ చేస్తామని ఎస్పీ రామ్​ కుమార్​ తెలిపారు.

'ఇది రాజకీయ కుట్ర?'

అయితే.. ఈ ఘటనపై మృతుడి సన్నిహితుడు, స్థానిక ఎమ్మెల్యే రాజ్​ సిన్హా స్పందిస్తూ.. ఇది రాజకీయ హత్య అని అభిప్రాయపడ్డారు. 'అనతికాలంలోనే సతీశ్​ సింగ్​ ప్రజాదారణ పొందిన వ్యక్తిగా ఎదిగారు. దీన్ని సహించలేకే ఆయన్ను హత్య చేశారు' అని సిన్హా పేర్కొన్నారు.

ఇదీ చదవండి: ఈ చిరు చిట్కాలతో తలనొప్పిని తరిమేయండిలా..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.