ETV Bharat / bharat

అక్టోబర్​లో 58ఏళ్ల కనిష్ఠానికి దిల్లీ ఉష్ణోగ్రతలు

దిల్లీలో ఉష్ణోగ్రతలు అంతకంతకూ పడిపోతున్నాయి. 58ఏళ్ల తర్వాత ఈ ఏడాది అక్టోబర్​లో సగటు కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

Delhi witnesses coldest October in 58 years
దిల్లీలో 58ఏళ్ల నాటికి చేరిన కనిష్ఠ ఉష్ణోగ్రతలు
author img

By

Published : Oct 31, 2020, 3:32 PM IST

దేశ రాజధాని దిల్లీలో అక్టోబర్​లో ఉష్ణోగ్రతలు కనిష్ఠ స్థాయికి పడిపోయాయని జాతీయ వాతావరణ విభాగం(ఐఎండీ) వెల్లడించింది. 58ఏళ్ల తర్వాత ఉష్ణోగ్రతలు కనిష్ఠ స్థాయికి పడిపోయినట్లు ఐఎండీ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. సాధారణంగా దిల్లీలో అక్టోబర్​ నెలల్లో సగటు కనిష్ఠ ఉష్ణోగ్రతలు 19.1 డిగ్రీ సెల్సియస్​గా నమోదవుతుంటాయి. అయితే.. ఈ అక్టోబర్​లో 17.2 డిగ్రీ సెల్సియస్​గా నమోదయ్యాయి. 1962లో నమోదైన 16.9 డిగ్రీల సెల్సియస్​ తర్వాత ఇదే అత్యల్పం అని ఐఎండీ తెలిపింది.

గత గురువారం(అక్టోబర్​ 29న) దిల్లీలో కనిష్ఠ ఉష్ణోగ్రత 12.5 డిగ్రీ సెల్సియస్​గా రికార్డైంది. 26 ఏళ్లలో అంటే 1994 తర్వాత అక్టోబర్​ నెలలో ఒక్కరోజులో నమోదైన అతి తక్కువ ఉష్ణోగ్రతలు ఇదే కావడం గమనార్హం. అయితే.. ఆకాశం మేఘావృతమవడం, మబ్బులు కమ్మేయడం వల్లే.. ఉష్ణోగ్రతలు అత్యల్పస్థాయికి పడిపోయాయని ఐఎండీ ప్రాంతీయ డైరెక్టర్​ కుల్దీప్​ శ్రీవాస్తవ అన్నారు.

దిల్లీలో 1937 అక్టోబర్​ 31న నమోదైన 9.4డిగ్రీ సెల్సియస్​ ఉష్ణోగ్రతే ఇంతవరకు రికార్డు స్థాయి అత్యల్పంగా ఉంది.

ఇదీ చదవండి- దిల్లీలో ఇంకా తీవ్ర స్థాయిలోనే గాలి నాణ్యత

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.