ETV Bharat / bharat

దిల్లీ అల్లర్లు: 43కు చేరిన మృతుల సంఖ్య

delhi-violence
దిల్లీ అల్లర్లు
author img

By

Published : Feb 28, 2020, 3:28 PM IST

Updated : Mar 2, 2020, 8:57 PM IST

15:11 February 28

దిల్లీ అల్లర్లు: 43కు చేరిన మృతుల సంఖ్య

దిల్లీ అల్లర్ల మృతుల సంఖ్య 43కు చేరింది. పౌరసత్వ చట్టానికి వ్యతిరేక, అనుకూల వర్గాల మధ్య ఘర్షణలతో అట్టుడికిన ఈశాన్య దిల్లీ ప్రస్తుతం కాస్త శాంతించింది. అల్లర్లు సద్దుమణిగాయి. క్రమక్రమంగా సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. కొద్ది రోజులుగా భయం గుప్పిట్లో బిక్కుబిక్కుమంటూ గడిపిన ప్రజలు ఇప్పుడిప్పుడే రోడ్లపైకి వస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో కిరాణా దుకాణాలు, వ్యాపార సముదాయాలు తెరుచుకుంటున్నాయి.

7 వేల మంది బలగాలు..

ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా భారీగా భద్రతా దళాలను మోహరించారు అధికారులు. దిల్లీ పోలీసులతో పాటు సుమారు 7 వేల మంది పారామిలిటరీ బలగాలు గస్తీ కాస్తున్నాయి.

దిల్లీలోని చాంద్​బాగ్​లో పర్యటించారు జాయింట్​ కమిషనర్​ ఓపీ మిశ్రా. ప్రజలు భయపడకుండా తమ రోజువారీ జీవనాన్ని నిర్భయంగా కొనసాగించవచ్చని భరోసా కల్పించారు.

" సాధారణ పరిస్థితులకు ఇది సూచిక. మా సమక్షంలో దుకాణాలు తెరవాలని నేను భరోసా ఇస్తున్నా. నిన్నటి నుంచే సాధారణ పరిస్థితులు నెలకొనటం ప్రారంభమైంది. ఇక్కడ నివసించే వారికి మతాలకు అతీతంగా భరోసా కల్పించటమే మా తొలి ప్రాధాన్యం. కొద్ది రోజులుగా అల్లర్లతో ప్రభావితమైన తమ సాధారణ జీవనాన్ని తిరిగి ప్రారంభించాలని కోరుతున్నాం. మసీదులకు ప్రార్థనల కోసం వెళ్లేవారికి భద్రత కల్పించేందుకు అన్ని రకాల ఏర్పాట్లు చేశాం. "

- ఓపీ శర్మ, జాయింట్​ కమిషనర్​

ప్రత్యేక కమిషనర్​గా ఎస్​ఎన్​ శ్రీవాస్తవ..

దిల్లీ అల్లర్ల నేపథ్యంలో కేంద్ర హోంశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఎస్​ఎన్​ శ్రీవాస్తవను దిల్లీ శాంత్రిభద్రతల ప్రత్యేక కమిషనర్​గా నియమించింది. ప్రస్తుత కమిషనర్​ అమూల్య పట్నాయక్​ శనివారం బాధ్యతల నుంచి తప్పుకోనున్నారు. శ్రీవాస్తవ ఆదివారం బాధ్యతలు చేపడతారు.

43 మంది మృతి..

ఈశాన్య దిల్లీలోని జాఫ్రాబాద్​, మౌజ్​పుర్​, చాంద్​బాగ్​, ఖురేజి ఖాస్​, భజన్​పుర ప్రాంతాల్లో జరిగిన హింసాత్మక ఘటనల్లో ఇప్పటివరకు 43 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 200 మందికిపైగా గాయపడ్డారు. అయితే గత 36 గంటలుగా ఎలాంటి ఘటనలు చోటు చేసుకోలేదని తెలిపారు కేంద్ర హోంమంత్రి అమిత్​ షా. పరిస్థితులను బట్టి 144 సెక్షన్​ను సడలిస్తామన్నారు.

Last Updated : Mar 2, 2020, 8:57 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.