ETV Bharat / bharat

'ట్రాక్టర్​ ర్యాలీ'పై వీడని సందిగ్ధత- శుక్రవారం మళ్లీ భేటీ

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త సాగు చట్టాలను వ్యతిరేకిస్తూ జనవరి 26న రైతులు తలపెట్టిన ట్రాక్టర్​ ర్యాలీపై పోలీసులు, కర్షకుల మధ్య చర్చలు మరోమారు అసంపూర్తిగానే ముగిశాయి. శుక్రవారం కేంద్రంతో చర్చల అనంతరం మళ్లీ పోలీసు అధికారులతో సమావేశమవనున్నట్లు రైతు నేతలు తెలిపారు.

Tractor rally
'ట్రాక్టర్​ ర్యాలీ'పై వీడని సందిగ్ధత
author img

By

Published : Jan 21, 2021, 4:09 PM IST

సాగు చట్టాలకు వ్యతిరేకంగా గణతంత్ర దినోత్సవం రోజున దేశ రాజధాని దిల్లీలో తలపెట్టిన ట్రాక్టర్​ ర్యాలీపై పోలీసులు, రైతుల మధ్య చర్చలు అసంపూర్తిగానే ముగిశాయి. ఈ అంశంపై శుక్రవారం మరోమారు సమావేశమై చర్చించనున్నట్లు రైతు సంఘాల నేతలు తెలిపారు.

ట్రాక్టర్ ర్యాలీ నిర్వహణపై గురువారం సింఘూ సరిహద్దులోని మంత్రం రిసార్ట్​లో రైతు సంఘాల నేతలు, దిల్లీ, ఉత్తర్​ప్రదేశ్​, హరియాణాకు చెందిన సీనియర్​ పోలీసు అధికారుల మధ్య చర్చలు జరిగాయి. దిల్లీ పోలీసు జాయింట్​ కమిషనర్​ ఎస్​ఎస్​ యాదవ్​, ప్రత్యేక సీపీ( నిఘా విభాగం) దీపేందర్​ పఠక్​, ప్రత్యేక సీపీ సంజయ్​ సింగ్​ సహా పలువురు సీనియర్​ అధికారులు హాజరయ్యారు.

" భద్రతా సమస్యల కారణంగా దిల్లీ బాహ్య వలయ రహదారిపై ట్రాక్టర్​ ర్యాలీ నిర్వహించొద్దని ప్రభుత్వం తెలిపింది. అయితే.. అక్కడే ట్రాక్టర్ ర్యాలీ చేపట్టి తీరతామని స్పష్టం చేశాం. శుక్రవారం కేంద్రంతో జరిగే చర్చల అనంతరం పోలీసు అధికారులతో మారోమారు భేటీ కానున్నాం. "

- దర్శన్​ పాల్​, క్రాంతికారీ కిసాన్​ యూనియన్​

బుధవారం దిల్లీలోని విజ్ఞాన్​ భవన్​లో పోలీసు ఉన్నతాధికారులతో జరిగిన సమావేశంలో ట్రాక్టర్​ ర్యాలీ మార్గం, వసతులపై చర్చించారు. అయితే.. దిల్లీ బాహ్య వలయ రహదారిపై కాకుండా.. కుంద్లీ-మనెసర్​-పల్వాల్​ ఎక్స్​ప్రెస్​ రహదారిలో నిర్వహించాలని పోలీసులు సూచించారు. అందుకు రైతు సంఘాలు అంగీకరించకపోవటం వల్ల గురువారం మరోమారు భేటీ కావాల్సి వచ్చింది. అయినప్పటికీ ఈ చర్చలూ ఫలించలేదు.

ఇదీ చూడండి: పుణె సీరం ఇన్​స్టిట్యూట్​లో అగ్ని ప్రమాదం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.