దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ స్వీయ నిర్బంధంలోకి వెళ్లారు. ఆదివారం మధ్యాహ్నం నుంచి గొంతునొప్పి, జ్వరంతో బాధపడుతున్నట్లు ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా ప్రకటించారు. ఈ నేపథ్యంలో మంగళవారం ఆయనకు కరోనా టెస్టులు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఇప్పటికే డయాబెటిస్తో బాధపడుతున్నారు కేజ్రీవాల్.
అన్ని సమావేశాలు రద్దు..
ఆదివారం ఉదయం కేబినెట్ మీటింగ్‌లో పాల్గొన్నారు కేజ్రీవాల్. ఈ సమావేశం అనంతరం.. అస్వస్థతకు గురయిన కారణంగా ముఖ్యమంత్రి అన్ని అధికారిక కార్యక్రమాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది సీఎం కార్యాలయం.
లెఫ్టినెంట్ గవర్నర్‌తో భేటీలోనే సోకిందా!
గత రెండు నెలలుగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అధికారిక సమావేశాలు నిర్వహిస్తున్న కేజ్రీవాల్.. లెఫ్టినెంట్ గవర్నర్‌తో మీటింగుల్లో వ్యక్తిగతంగా హాజరవుతున్నారు. ఈ నేపథ్యంలో జూన్ 2న లెఫ్టినెంట్ గవర్నర్‌తో జరిగిన సమావేశంలో పాల్గొన్న 13మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది. ఈ సందర్భంగానే కేజ్రీకి కరోనా సోకి ఉండవచ్చని అధికారులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
ఇదీ చూడండి: రాష్ట్రానికి రెండో రాజధానిపై ఉత్తర్వులు జారీ