ఐరాస భద్రతా మండలి తాత్కాలిక సభ్య దేశంగా భారత్ ఎన్నికవటం పట్ల ప్రధాని నరేంద్రమోదీ హర్షం వ్యక్తం చేశారు. ఇందుకు సహకరించిన అంతర్జాతీయ సమాజానికి కృతజ్ఞతలు తెలిపారు.
-
Deeply grateful for the overwhelming support shown by the global community for India's membership of the @UN Security Council. India will work with all member countries to promote global peace, security, resilience and equity.
— Narendra Modi (@narendramodi) June 18, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">Deeply grateful for the overwhelming support shown by the global community for India's membership of the @UN Security Council. India will work with all member countries to promote global peace, security, resilience and equity.
— Narendra Modi (@narendramodi) June 18, 2020Deeply grateful for the overwhelming support shown by the global community for India's membership of the @UN Security Council. India will work with all member countries to promote global peace, security, resilience and equity.
— Narendra Modi (@narendramodi) June 18, 2020
"భారత సభ్యత్వానికి మద్దతు ఇచ్చిన దేశాలకు కృతజ్ఞతలు. సభ్యదేశాలతో కలిసి ప్రపంచ శాంతి, భద్రత, సమానత్వం కోసం కృషి చేస్తాం."
- ప్రధాని నరేంద్రమోదీ
జయ్శంకర్ స్పందన..
భద్రతా మండలి ఎన్నికల్లో విజయంపై ఐరాసలోని భారత శాశ్వత మిషన్, విదేశాంగ శాఖ బృందానికి విదేశాంగ మంత్రి జయ్శంకర్ శుభాకాంక్షలు తెలిపారు. అధికారుల కృషి వల్లనే ఇది సాధ్యమైందని కొనియాడారు.
ఏకగ్రీవంగా ఎన్నిక..
ఐక్యరాజ్య సమితి భద్రతామండలి (యూఎన్ఎస్సీ)లోని 5 తాత్కాలిక సభ్యదేశాల కోసం బుధవారం (జూన్ 17న) ఎన్నికల్లో భారత్ ఘనవిజయం సాధించింది. ఓటింగ్లో పాల్గొన్న 192 సభ్య దేశాల్లో కావాల్సిన మెజారిటీ మూడింట రెండొంతులు (128) దాటుకుని 184 ఓట్లు సాధించింది భారత్.
ఈ సారి ఆసియా-పసిఫిక్ స్థానం నుంచి పోటీ చేసిన భారత్ 2021-22 కాలానికి తాత్కాలిక సభ్యదేశంగా ఎన్నికైంది. 2021 జనవరి 1 నుంచి భారత్ సభ్యత్వం అమల్లోకి వస్తుంది. 2022 డిసెంబరుతో ముగుస్తుంది.
ఇదీ చూడండి: ఐరాస భద్రతామండలి ఎన్నికల్లో భారత్ ఘన విజయం