ETV Bharat / bharat

ముంచుకొస్తున్న 'నిసర్గ' తుపాను.. పశ్చిమ తీరం హై అలర్ట్​ - Deep depression in Arabian Sea intensifies into cyclone

భారత పశ్చిమ తీరాన్ని నిసర్గ తుపాను ముంచెత్తనుందని భారత వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఉత్తర మహారాష్ట్ర ప్రాంతంలో తుపాను తీరం దాటనుందని వెల్లడించింది. తుపాను తీరం దాటే సమయంలో అత్యంత వేగంగా గాలులు వీచే అవకాశం ఉందని స్పష్టం చేసింది. ప్రకృతి విపత్తుపై పోరుకు ఇప్పటికే 33 ఎన్డీఆర్​ఎఫ్ బృందాలు గుజరాత్​, మహారాష్ట్రల్లో మోహరించాయి. తుపానును ఎదుర్కొనేందుకు తీసుకునే జాగ్రత్తలపై ప్రధాని మోదీ సమీక్ష నిర్వహించారు. అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.

nisarga
పశ్చిమ తీరాన్ని ముంచెత్తనున్న 'నిసర్గ' తుపాను
author img

By

Published : Jun 2, 2020, 5:15 PM IST

అరేబియా సముద్రంలో ఉత్పన్నమయిన వాయుగుండం.. తుపానుగా మారిందని ప్రకటించింది భారత వాతావరణ శాఖ (ఐఎండీ). తూర్పు మధ్య అరేబియా సముద్రంలో గోవాకు నైరుతి దిశలో 280 కిలోమీటర్లు, ముంబయికి 490, సూరత్‌కు 710 కిలోమీటర్ల దూరంలో వాయుగుండం కేంద్రీకృతమై ఉందని వాతావరణ శాఖ తెలిపింది. మంగళవారం రాత్రి మరింత బలపడి తీవ్ర తుపానుగా మారుతుందని చెప్పింది. ఈ తుపానుకు నిసర్గగా నామకరణం చేసింది. బుధవారం ఉత్తర మహారాష్ట్ర, దక్షిణ గుజరాత్‌ ప్రాంతంలో తీరం దాటే అవకాశం ఉందని వెల్లడించింది. తుపాను తీరం దాటే సమయంలో గంటకు 105-110 కి.మీ వేగంతో గాలులు వీస్తాయని హెచ్చరించింది.

ముంబయిపై ప్రభావం..

నిసర్గ తుపాను నేపథ్యంలో మహారాష్ట్ర, గుజరాత్‌, గోవా ప్రభుత్వాలు హై అలెర్ట్ ప్రకటించాయి. మహారాష్ట్ర రాజధాని ముంబయిపై తుపాను ప్రభావం తీవ్రంగా ఉండే అవకాశం ఉందని హెచ్చరించింది ఐఎండీ. ఇప్పటికే కరోనా వ్యాప్తితో అతలాకుతలమవుతున్న ముంబయిని తుపాను ముంచెత్తితే జనజీవనం మరింత దుర్బరమయ్యే అవకాశం ఉంది.

సురక్షిత ప్రాంతాలకు తీర వాసులు..

భారత పశ్చిమ తీరం లక్ష్యంగా నిసర్గ తుపాను ముంచెత్తుకొస్తున్న నేపథ్యంలో జాగ్రత్త చర్యలకు దిగింది గుజరాత్ ప్రభుత్వం. వల్సాడ్​, నవ్​సరి జిల్లాల్లో తీరం వెంట ఉన్న 47 గ్రామాల్లోని 20,000 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించింది.

ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సంసిద్ధం..

తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు ఇప్పటికే మోహరించాయి. గుజరాత్​లో 17, మహారాష్ట్రలో 16 బృందాలు తుపాను వేళ సేవలు అందించనున్నాయి. ఒక్కో బృందంలో 45మంది సిబ్బంది పనిచేయనున్నారు.

ప్రధాని సమీక్ష..

నిసర్గ తుపానును ఎదుర్కొనేందుకు తీసుకునే జాగ్రత్తలపై సమీక్ష నిర్వహించారు ప్రధానమంత్రి నరేంద్రమోదీ. అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రతి ఒక్కరూ క్షేమంగా ఉండాలని ప్రార్థిస్తున్నట్లు పేర్కొన్నారు. అవసరమైన ముందుజాగ్రత్త చర్యలు తీసుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

ఇదీ చూడండి: 'కరోనా'ను విస్మరించి మంత్రి పర్యటన.. నెటిజన్ల విమర్శలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.