కరోనా టీకా మూడో దశ క్లినికల్ ట్రయల్స్‌కు సంబంధించిన మరిన్ని వివరాలను అందజేయాలని సీరమ్ ఇనిస్టిట్యూట్‌ను డీసీజీఐ కోరింది. వ్యాక్సిన్‌కు అనుమతి వేగవంతం చేయడంలో భాగంగా డాక్టర్ రెడ్డీస్‌ను కూడా వివరాలను అడిగింది.
మొత్తం ఆరు ప్రధాన ఔషధ సంస్థ వ్యాక్సిన్ క్యాండిడేట్లపై సమీక్ష నిర్వహించింది డీసీజీఐ. ఇందులో భాగంగా మూడో దశ ప్రయోగాల పూర్తి వివరాలను సమర్పించాలని ఆదేశించింది. శాంపిల్ పరిమాణం, ఒకటి, రెండు దశల ఫలితాలను అందజేయాలని తెలిపింది.
రెడ్డీస్ ప్రతిపాదించిన '2-డిఆక్సీ-డీ-గ్లూకోజ్' పౌడర్ డీసీజీఐ కొన్ని సూచనలు చేసింది. రెండో దశ ట్రయల్స్‌లో మంచి ఫలితాలు వచ్చాయని, అయితే దీని శాంపిల్ పరిమాణం చిన్నదని పేర్కొంది.
సీరమ్ ఇనిస్టిట్యూట్.. ప్రస్తుతం ఆక్స్ఫర్డ్ వ్యాక్సిన్ మూడో దశ క్లినికల్ ట్రయల్ నిర్వహిస్తోంది. ఆరోగ్యంగా ఉన్నవారు, వివిధ వయసుల వారిపైనా ట్రయల్స్ నిర్వహించేలా ప్రొటోకాల్ మార్చాలని కోరుతూ డీసీజీఐను సీరమ్ కోరింది.
ఇదీ చూడండి: 'కరోనాపై పోరులో చేతులు కడుక్కోవడమే ముఖ్యం'