ETV Bharat / bharat

యూపీ 'నిర్భయ' మృతి- పెల్లుబుకిన జనాగ్రహం

ఉత్తర్​ప్రదేశ్​లో సామూహిక అత్యాచారానికి గురై దిల్లీ ఆసుపత్రిలో చనిపోయిన ఎస్సీ యువతి మరణంపై దేశవ్యాప్తంగా ఆగ్రహజ్వాలలు రేగాయి. యోగి ఆదిత్యనాథ్​ సర్కార్​పై కాంగ్రెస్ సహా విపక్షాలు తీవ్ర విమర్శలు చేశాయి. మరోవైపు ఎస్సీ సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళనలకు దిగాయి.

Dalit woman gang-raped in Hathras dies in Delhi hospital
యూపీ 'నిర్భయ' మృతి- పెల్లుబుకిన జనాగ్రహం
author img

By

Published : Sep 29, 2020, 7:24 PM IST

Updated : Sep 29, 2020, 8:05 PM IST

దాదాపు రెండు వారాల పాటు మృత్యువుతో పోరాడి ఓడిన ఉత్తర్​ప్రదేశ్​ అత్యాచార బాధితురాలి మరణంపై యూపీ సహా దేశవ్యాప్తంగా ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. ఇంతటి అఘాయిత్యానికి పాల్పడిన నిందితులను నడిరోడ్డుపై ఉరి తీయాలని ఎస్సీ సంఘాలు డిమాండ్ చేశాయి. యూపీలో ఆడవారికి రక్షణ లేకుండా పోయిందని కాంగ్రెస్ సహా విపక్షాలు విమర్శలు చేశాయి.

యూపీ 'నిర్భయ' మృతి- పెల్లుబుకిన జనాగ్రహం
Dalit woman gang-raped in Hathras dies in Delhi hospital
కాంగ్రెస్ నిరసన

కాంగ్రెస్​ కార్యకర్తల నిరసన

మృత్యువుతో పోరాడి...

రెండువారాలకు ముందు ఉత్తర్​ప్రదేశ్​ హత్రాస్​ జిల్లాలోని గ్రామంలో సామూహిక అత్యాచారానికి గురైన 19 ఏళ్ల యువతి తీవ్ర గాయాలతో మంగళవారం ఉదయం దిల్లీ ఆసుపత్రిలో మరణించింది.

నిర్భయ ఘటనను గుర్తు చేసేలా అత్యంత పాశవికంగా ఆమెపై అత్యాచారం చేశారు రాక్షసులు. ఆమె వెన్నెముకకు తీవ్ర గాయం కాగా, పక్షవాతం వచ్చింది. నాలుక తెగిపోయింది. తీవ్ర గాయాల పాలై చివరికి ప్రాణాలు విడిచింది. నిందితులపై 302 సెక్షన్​ (హత్య) కింద కేసు నమోదు చేసినట్లు యూపీ హత్రాస్​ ఎస్పీ తెలిపారు.

ఆసుపత్రి ఎదుట...

ఆమె చనిపోయిన వార్త బయటకు వచ్చిన వెంటనే ఎస్సీ సంఘాలు, సామాజిక కార్యకర్తలు దిల్లీ సఫ్దార్​జంగ్​ ఆసుపత్రి ఎదుట, విజయ్​ చౌక్ ఎదుట ఆందోళనలు చేపట్టారు. భీమ్​ ఆర్మీ అధినేత చంద్రశేఖర్​ ఆజాద్... ఎస్సీలంతా నిరసనలు చేపట్టాలని పిలుపునిచ్చారు. తమ సహనాన్ని పరీక్షించవద్దని, నిందితులను వెంటనే ఉరితీయాలని డిమాండ్ చేశారు.

కాంగ్రెస్​ కార్యకర్తలు అరెస్ట్

కాంగ్రెస్​ కార్యకర్తలు అరెస్ట్​

భీమ్ ఆర్మీ అధినేత ఆజాద్

ప్రధాని మౌనమేల?

ఈ ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ సహా మహిళా భాజపా నేతలు ఎందుకు మౌనం వహిస్తున్నారని కాంగ్రెస్ ప్రశ్నించింది. ఉత్తర్​ప్రదేశ్​ దేశానికి నేర రాజధానిగా మారిందని విమర్శించింది. ఉత్తర్​ప్రదేశ్​ ప్రభుత్వానికి ఎఫ్​ఐఆర్​ నమోదు చేయడానికి 8 రోజులు ఎందుకు పట్టిందని కాంగ్రెస్ అధికార ప్రతినిధి సుప్రియా శ్రీనాథే ప్రశ్నించారు. రాష్ట్రంలోని 312 మంది భాజపా శాసనసభ్యుల్లో 83 మంది తీవ్ర నేరారోపణలు ఎదుర్కొంటున్నారని ఆరోపించారు.

ఆమ్​ఆద్మీ నిరసన

ఆమ్ ఆద్మీ ఆందోళన

ఇది అసత్య వార్తా?

ఈ ఘటనపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్రంగా స్పందిచారు.

"ప్రభుత్వం ఇది అసత్య వార్త అని చెప్పి.. బాధితురాలు చనిపోయేలా చేసింది. ఇది దురదృష్టకరం కాదు, అసత్య వార్త అంతకన్నా కాదు. ఈ ఘటనకు ప్రభుత్వమే కారణం."

- రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అగ్రనేత

"ఉత్తర్​ప్రదేశ్​లో శాంతిభద్రతలు ఘోరంగా విఫలమయ్యాయి. మహిళలకు భద్రత లేకుండా పోయింది. నేరస్థులు బహిరంగంగా దారుణాలకు ఒడిగడుతున్నారు."

- ప్రియాంక గాంధీ, కాంగ్రెస్​ ప్రధాన కార్యదర్శి

"ఎస్సీ యువతి మృతి ఉత్తర్​ప్రదేశ్​ మొత్తాన్ని తీవ్రంగా బాధిస్తోంది. ఆమె కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాల సహకారం అందివ్వాలి. నిందితులకు త్వరితగతిన శిక్ష పడేలా ఫాస్ట్​ ట్రాక్​ కోర్టులో విచారణ జరపాలి. ఇది బీఎస్పీ డిమాండ్."

- మాయావతి, బీఎస్పీ అధినేత్రి

"ఓ ఎస్సీ యువతి సామూహిక అత్యాచారానికి బలైపోయింది. ఆమె కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి. ప్రస్తుత ప్రభుత్వం న్యాయం చేస్తుందని ఎలాంటి ఆశ లేదు."

- అఖిలేశ్​ యాదవ్, ఎస్పీ అధినేత

"ఎంతోమంది కూతుళ్లు అత్యాచారానికి బలైపోతుంటే చాలా బాధగా ఉంది. వారిని రక్షించలేకపోతున్నందుకు సిగ్గుపడాల్సి వస్తోంది. నిందితులను వీలైనంత త్వరగా ఉరి తీయాలి."

- అరవింద్​ కేజ్రీవాల్, దిల్లీ ముఖ్యమంత్రి

ఘటనపై జాతీయ మహిళా ఛైర్​పర్సన్​ రేఖా శర్మ స్పందించారు. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. బాధితురాలి కుటుంబానికి అండగా ఉంటామన్నారు.

ఇదీ జరిగింది..

సెప్టెంబర్​ 14న యూపీలో దళిత యువతిపై నలుగురు దుండగులు అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం గొంతుకోసి హతమార్చేందుకు ప్రయత్నించారు. ఈ ఘటనలో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో బాధితురాలిని తొలుత యూపీ అలీగఢ్​లోని జవహర్​లాల్​ నెహ్రూ వైద్య కళాశాల ఆస్పత్రిలో చేర్పించారు. ఆ తర్వాత మెరుగైన చికిత్స కోసం దిల్లీలోని సఫ్దార్​ జంగ్​ ఆస్పత్రికి తరలించారు.

Last Updated : Sep 29, 2020, 8:05 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.