ETV Bharat / bharat

తీరం దాటిన అంపన్-బంగాల్​లో ఇద్దరు మృతి - Amphan cyclone latest news

భయంకరమైన గాలులు, భీకరమైన వర్షాల కలబోతతో అంపన్ తుపాను తీరం దాటింది. ఆ సమయంలో బంగాల్, ఒడిశాలోని పలు ప్రాంతాలు అతలాకుతలం అయ్యాయి. ఈదురుగాలుల ధాటికి చెట్లు విరిగి పడటం వల్ల బంగాల్​లో ఇద్దరు మరణించినట్లు అధికారులు తెలిపారు. ఎన్​డీఆర్​ఎఫ్ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టినట్లు స్పష్టం చేశారు.

amphan
అంపన్
author img

By

Published : May 20, 2020, 9:25 PM IST

Updated : May 20, 2020, 9:41 PM IST

గంటకు 190 కి.మీ గరిష్ఠ వేగంతో గాలులు, భారీ వర్షాలతో అంపన్ తుపాను తీరం దాటింది. పశ్చిమ్ బంగ, బంగ్లాదేశ్​ సరిహద్దులోని దిఘా, హతియా దీవుల సమీపంలో మధ్యాహ్నం 3:30 గంటల నుంచి సాయంత్రం 5:30 గంటల మధ్య తుపాను తీరం దాటినట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఆ సమయంలో గంటకు 155-165కి.మీ వేగంతో బలమైన గాలులు వీచినట్లు వెల్లడించింది.

తీరం దాటిన అంపన్-బంగాల్​లో ఇద్దరి మృతి

తుపాను ప్రభావానికి చెట్లు విరిగిపడటం వల్ల బంగాల్​లోని హావ్​ డా జిల్లాలో ఒకరు, ఉత్తర 24 పరగణాల జిల్లాలో మరొకరు మరణించినట్లు అధికారులు తెలిపారు. ఒడిశా, బంగాల్​లో కలిపి మొత్తం 40 ఎన్​డీఆర్​ఎఫ్ బృందాలు సహాయక చర్యల్లో పాల్గొన్నాయి. వాహనాల రాకపోకలకు అనుగుణంగా రహదారులపై విరిగిపడ్ల చెట్లను తొలగిస్తున్నారు. వృక్షాలను తొలగించడానికి భారీ యంత్రాలను రంగంలోకి దించారు.

Cyclone 'Amphan' makes landfall, 2 die in Bengal
రహదారిపై చెట్లను తొలగిస్తున్న ఎన్​డీఆర్​ఎఫ్ సిబ్బంది

తుపాను ప్రభావం

తుపాను తీరం దాటే సమయంలో బంగాల్, ఒడిశా రాష్ట్రాల సముద్రతీర ప్రాంతాల్లో.. అల్లకల్లోలం చోటుచేసుకుంది. భారీ వర్షాలు, ఈదురుగాలులతో భీతావహ వాతావరణం ఏర్పడింది. పదుల సంఖ్యలో వృక్షాలు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. ఇళ్ల పైకప్పులు ఎగిరిపోయాయి. లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లన్నీ నీట మునిగాయి. దిఘా బీచ్​ వద్ద భారీ ఎత్తున అలలు ఎగసిపడ్డాయి.

తుపాను ధాటికి ధ్వంసమైన ఓ నిర్మాణం

విరిగిపడిన చెట్లు, నేలకొరిగిన విద్యుత్ స్తంభాలు

ఒడిశాలోని పూరీ, ఖుర్దా, జగత్​సింగపుర్, కటక్, కేంద్రపారా, జజ్​పుర్, గన్​జమ్, భద్రక్, బాలాసోర్ జిల్లాల్లో భారీగా వర్షాపాతం నమోదైంది. ఈదురుగాలులతో కురిసిన వర్షాలకు పెద్ద ఎత్తున ఆస్తి నష్టం సంభవించింది. పంట పొలాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి.

అంతకుముందు, తుపాను ప్రభావిత ప్రాంతాల నుంచి లక్షలాది మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు అధికారులు. బంగాల్​లో 5 లక్షల మంది, ఒడిశాలో 1.58 లక్షల మందిని పునరావస కేంద్రాలకు పంపించారు.

గురువారం కూడా వర్షాలు

తూర్పు మిదనాపుర్, ఉత్తర, దక్షిణ 24 పరగణాల జిల్లాల్లో.. తుపాను తీవ్ర ప్రభావం చూపిందని వాతావరణ శాఖ డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ్ మోహపాత్ర తెలిపారు. గంటకు 185 కి.మీ వేగంతో గాలులు వీచినట్లు వెల్లడించారు. తుపాను కేంద్రకం 30 కిలోమీటర్ల పరిధి విస్తరించి ఉందని పేర్కొన్నారు. బంగ్లాదేశ్​ దాటిన తర్వాత(బుధవారం రాత్రికల్లా) తీవ్ర వాయుగుండంగా మారి పూర్తిగా బలహీనపడుతుందని చెప్పారు.

ఒడిశాలో బుధవారం రాత్రి వరకు భారీ వర్షాలు కురుస్తాయని స్పష్టం చేశారు. బంగాల్​లో గురువారం కూడా ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.

అసోం, మేఘాలయాలోనూ తుపాను ప్రభావం కనిపించనున్నట్లు మృత్యుంజయ్ స్పష్టం చేశారు. ఈ రాష్ట్రాల్లో గురువారం భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవచ్చని అంచనా వేశారు.

బంగాల్​ తీరంలో కమ్ముకున్న కారుమబ్బులు

కచ్చితమైన అంచనాలు

బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడినప్పటి నుంచి తుపాను తీరం దాటే వరకు వాతావరణ శాఖ అత్యంత కచ్చితమైన అంచనాలు వెలువరించిందని తెలిపారు మృత్యుంజయ్. తుపాను మార్గం, నిర్దిష్ట సమయం గురించి ముందుగానే సమాచారం అందించడం వల్ల విపత్తు నిర్వహణ బృందాలకు.. సహాయక చర్యలు చేపట్టడానికి మార్గం సుగమమైందని అన్నారు.

రైళ్లు రద్దు

తుపాను ప్రభావంతో బుధవారం హావ్‌డా నుంచి దిల్లీకి, దిల్లీ నుంచి హావ్‌డాకు గురువారం నడవాల్సిన ఏసీ రైళ్లు సహా హిమాచల్‌ప్రదేశ్ నుంచి కోల్‌కతాకు రావాల్సిన ప్రత్యేక రైళ్లనూ రద్దు చేసింది. కోల్‌కతాలోని డండం విమానాశ్రాయన్ని సాయంత్రం 5గంటల వరకు మూసివేశారు.

బంగ్లాదేశ్​లోనూ

తుపాను నేపథ్యంలో తీర ప్రాంతాల్లోని 20 లక్షల మంది ప్రజలను బంగ్లాదేశ్​ ప్రభుత్వం ఖాళీ చేయించింది. ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఆశ్రయాలకు వీరందరినీ తరలించినట్లు అధికారులు తెలిపారు. పలు జిల్లాల్లో 'తీవ్రమైన ప్రమాద' హెచ్చరికలు జారీ చేశారు.

Last Updated : May 20, 2020, 9:41 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.