పెను తుపాను అంపన్ కోల్‌కతాలోని పుస్తకాల మార్కెట్లకు ప్రఖ్యాతి గాంచిన కాలేజ్ స్ట్రీట్‌పై తీవ్ర ప్రభావం చూపింది. వరద ధాటికి పుస్తకాల షాపులు ఎక్కడికక్కడ పూర్తిగా నీటమునిగాయి. ఈ ప్రమాదంలో సుమారు రూ.50 లక్షల నుంచి రూ.60 లక్షల విలువైన పుస్తకాలు నీటిపాలయినట్లు అధికారులు తెలిపారు.
అంపన్ తుపాను కారణంగా బంగాల్, ఒడిశా రాష్ట్రాల్లో జరిగిన విధ్వంసాన్ని అంచనా వేస్తున్న సమయంలో కనిపించిన ఈ దృశ్యాలు.. అనేక మంది పుస్తక ప్రియులను కలతచెందేలా చేశాయి.
అతిపెద్ద మార్కెట్...
ఆసియాలోనే అతిపెద్ద పుస్తక మార్కెట్లలో ఒకటిగా పేరుగాంచింది కాలేజ్ స్ట్రీట్. ఈ ప్రాంతానికి సమీపంలో ఎన్నో కళాశాలలు, విశ్వవిద్యాలయాలు ఉండటం వల్ల ఆ పేరు వచ్చింది.