గ్యాంగ్స్టర్ వికాస్ దుబే ఎన్కౌంటర్ దేశవ్యాప్తంగా వార్తల్లో నిలిచింది. అయితే అతడిని ఎన్కౌంటర్ చేసిన ప్రదేశం కూడా సంచలనంగా మారింది. దుబే మరణ వార్త విన్న అనంతరం స్థానిక ప్రజలు ఘటనాస్థలానికి భారీగా తరలివెళ్లారు. ఏం జరిగిందో తెలుసుకునేందుకు ఎగబడ్డారు.
8మంది పోలీసులను హత్య చేసిన గ్యాంగ్స్టర్ దుబేను గురువారం మధ్యప్రదేశ్ పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం శుక్రవారం ఉత్తరప్రదేశ్లోని కాన్పుర్ శివార్లలో జరిగిన ఎన్కౌంటర్లో దుబే హతమయ్యాడు. తమ వద్ద నుంచి తుపాకీ లాక్కుని కాల్పులు జరుపుతూ పారిపోతుండగా.. ఆత్మరక్షణ కోసం అతడిని ఎన్కౌంటర్ చేశారు పోలీసులు.
![Crowds gather around encounter spot, some take selfies](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/7978778_278_7978778_1594431185110.png)
అయితే ఘటనాస్థలంలో బోల్తా పడి ఉన్న వాహనాన్ని తొలగించడానికి ఆలస్యమైంది. ఈ సమయంలో దానిని చూడటానికి స్థానికులు ఎగబడ్డారు. అటువైపుగా వెళ్తున్న వాహనాలు కూడా ఆగి చూడటం మొదలుపెట్టాయి. దీని వల్ల ట్రాఫిక్కు అంతరాయం కలిగింది.
ఆ తర్వాత వాహనాన్ని తొలగించినా.. రక్తపు మరకలు అలాగే ఉండిపోయాయి. కొంతమేర నీలిరంగులోకి మారాయి. వర్షం, ఫోరెన్సిక్ పరీక్ష వల్ల ఇలా జరిగినట్టు భావిస్తున్నారు. ఆ రక్తపు మరకలను కూడా ఆసక్తిగా తిలకించారు ప్రజలు. అంతేకాకుండా ఘటనాస్థలంలో సెల్ఫీలు కూడా తీసుకున్నారు.
ఇవీ చూడండి:-