ETV Bharat / bharat

కుటుంబ సభ్యులకు మీరిచ్చే బహుమతి అదే: రజనీకాంత్​ - సూపర్​స్టార్​ రజనీకాంత్​

ప్రపంచదేశాల్లో ఉన్న తమిళులు ఎక్కడ ఉన్నప్పటికీ తమను తాము రక్షించుకోవాలని కోరారు సూపర్​స్టార్ రజనీకాంత్. ఆంక్షలను పాటిస్తే కచ్చితంగా మహమ్మారిపై విజయం సాధించవచ్చని అన్నారు.

author img

By

Published : Apr 15, 2020, 5:59 AM IST

దేశంలో లాక్​డౌన్ మే 3 వరకు పొడిగించిన నేపథ్యంలో ప్రపంచంలోని తమిళ ప్రజలకు కొన్ని సూచనలు చేశారు సూపర్​స్టార్​ రజనీకాంత్​. ప్రపంచంలో తమిళులు ఎక్కడ ఉన్నా ఆయా ప్రభుత్వాల నిబంధనలను పాటించాలని కోరారు. అలా చేస్తే తప్పకుండా కరోనా వైరస్​పై విజయం సాధించవచ్చని తెలిపారు.

తమిళ నూతన ఏడాది సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఓ వీడియోను ట్విట్టర్​లో పోస్ట్​ చేశారు రజినీకాంత్​.

"విదేశాలతో సహా దేశంలోని ఇతర ప్రాంతాల్లో జీవిస్తున్న తమిళ ప్రజలారా! కరోనా వైరస్​ ​నుంచి మీకు మీరు రక్షించుకోవడానికి నిబంధనలను పాటించండి. నూతన సంవత్సరం సందర్భంగా మీ కుటుంబ సభ్యులకు మీరు ఇచ్చే 'అతి పెద్ద బహుమతి' ఇదే. జాగ్రత్తగా జీవించండి. ఆందోళన చెందవద్దు. దీనిపై కచ్చితంగా విజయం సాధిస్తాం."

-రజనీకాంత్​, కథానాయకుడు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.