ETV Bharat / bharat

' కరోనా యోధులకు వేతనాలు ఇచ్చేలా చూడాలి' - doctors quarantine news

దేశంలోని వైద్యులందరికీ వేతనాలు ఇచ్చేలా అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించాలని కేంద్రాన్ని ఆదేశించింది సుప్రీంకోర్టు. వాళ్లకి క్వారంటైన్​ సదుపాయాలు కూడా ఏర్పాటు చేయాలని స్పష్టం చేసింది. ఇందుకు సంబంధించి నాలుగు వారాల్లోగా నివేదిక అందజేయకపోతే తీవ్రంగా పరిగణించాల్సి ఉంటుందని హెచ్చరించింది.

COVID-19: SC says Centre should direct states to pay salaries to doctors
'కొవిడ్​పై పోరాడుతున్న వైద్యులకు వేతనాలు ఇచ్చేలా చూడాలి'
author img

By

Published : Jun 17, 2020, 12:19 PM IST

కరోనా మహమ్మారిపై పోరాటంలో ముందు వరుసలో ఉన్న వైద్యులకు వేతనాలు అందేలా అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించాలని కేంద్రాన్ని ఆదేశించింది సుప్రీంకోర్టు. కరోనా రోగులకు చికిత్స అందిస్తున్న వైద్యులు, ఆరోగ్య కార్యకర్తలకు క్వారంటైన్ సదుపాయాలు కల్పించాలని స్పష్టం చేసింది.

వైద్యులకు 14రోజుల క్వారంటైన్ అవసరం లేదని మే 15న కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని సవాలు చేస్తూ సుప్రీంను ఆశ్రయించారు ఓ ప్రైవేటు వైద్యుడు. జస్టిస్ అశోక్ భూశణ్​, జస్టిస్​ ఎస్ కే కౌల్​, జస్టిస్​ ఎం ఆర్​ షాలతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్​పై విచారణ జరిపింది. వైద్యులకు, ఆరోగ్యకార్యకర్తలకు క్వారంటైన్ నిరాకరించడానికి వీల్లేదని పేర్కొంది.

వైద్యులకు వేతనాలు, క్వారంటైన్​ సదుపాయాలకు సంబంధించి 4 వారాల్లోగా సమ్మతి నివేదికను సమర్పించాలని కేంద్రానికి సూచించింది సర్వోన్నత న్యాయస్థానం. లేకపోతే తీవ్రంగా పరిగణించాల్సి ఉంటుందని హెచ్చరించింది.

ఇదీ చూడండి: 'సరిహద్దు వివాదంపై ప్రధాని మౌనం వీడాలి'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.