ETV Bharat / bharat

దేశంలో 90 శాతానికి కరోనా రికవరీ రేటు

దేశంలో కొవిడ్​-19 నుంచి కోలుకుంటున్నవారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఫలితంగా రికవరీ రేటు 90శాతానికి చేరిందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. యాక్టివ్​​ కేసులు 8.5 శాతమే ఉన్నాయని పేర్కొంది.

COVID-19: Recovery rate touches 90 pc; only 8.5 pc of total caseload active in India
దేశంలో 90 శాతానికి చేరువలో రికవరీ రేటు
author img

By

Published : Oct 25, 2020, 4:31 PM IST

దేశంలో కరోనా కేసులు అధిక సంఖ్యలో నమోదవుతున్నప్పటికీ... మహమ్మారి నుంచి కోలుకుంటున్నవారి సంఖ్య పెరుగుతోంది. తాజాగా కరోనాను జయించిన 62,077 మందితో కలిపి మొత్తం 70,78,123 వైరస్​ నుంచి కోలుకున్నారని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ వెల్లడించింది. ఫలితంగా రికవరీ రేటు 90 శాతానికి చేరిందని తెలిపింది.

యాక్టివ్​ కేసుల్లో తగ్గుదల

యాక్టివ్​ కేసుల సంఖ్యలో తగ్గుదల కనిపిస్తోంది. వరుసగా మూడో రోజు ఏడు లక్షల కంటే తక్కువ యాక్టివ్​ కేసులు ఉన్నాయని ఆరోగ్య శాఖ తెలిపింది. దీంతో కేసు లోడ్​​ 8.50 శాతమే ఉన్నట్లు వెల్లడించింది.

ప్రస్తుతం 6 లక్షల 68 వేల మందికి పైగా కొవిడ్​తో బాధపడుతున్నారు.

ఆరోగ్య శాఖ ప్రకారం...

  • 10 రాష్ట్రాల్లోనే ఎక్కువ కొవిడ్​ కేసులు నమోదవుతున్నాయి. అత్యధికంగా కేరళలో కరోనా కేసులు వెలుగుచూడగా.. మహారాష్ట్ర తర్వాత స్థానంలో ఉంది.
  • గడిచిన వారం రోజులుగా రోజువారి కరోనా మరణాలు వెయ్యి లోపే నమోదవుతున్నాయి. 10 రాష్ట్రాల్లోనే 80 శాతం కరోనా మరణాలు సంభవిస్తున్నాయి. అత్యధికంగా మహారాష్ట్రలో కొవిడ్​ మృతులు వెలుగుచూస్తున్నాయి.
  • కొత్తగా వైరస్​ నుంచి కోలుకుంటున్నవారిలో మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ, తమిళనాడు, బంగాల్​, దిల్లీ, ఆంధ్రప్రదేశ్​, అసోం, ఉత్తర్​ప్రేదేశ్​, ఛత్తీస్​గఢ్ రాష్ట్రాల్లోనే ఉన్నారు.
  • దేశంలో కరోనా టెస్టింగ్​ లేబొరేటరీల సంఖ్య రెండు వేలకు పైగా పెంపు.

ఇదీ చూడండి: 'పాక్​, చైనాతో యుద్ధానికి ముహూర్తం ఫిక్స్'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.