ETV Bharat / bharat

కరోనాతో జైళ్లలోని ఖైదీల పరిస్థితిపై సుప్రీం విచారణ - covid 19 latest news

జైళ్లలో గదుల సామర్థ్యానికి మించి ఖైదీలు ఉండే అంశాన్ని సుమోటోగా స్వీకరించి విచారణ చేపట్టింది సుప్రీంకోర్టు. కరోనా వైరస్​ వ్యాప్తి నేపథ్యంలో ఈ విషయంపై అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు తమ స్పందన తెలపాలని ఆదేశించింది.

supreme
కరోనాతో జైళ్లల్లోని ఖైదీల పరిస్థితిపై సుప్రీం విచారణ
author img

By

Published : Mar 16, 2020, 3:44 PM IST

Updated : Mar 16, 2020, 4:40 PM IST

కరోనాతో జైళ్లలోని ఖైదీల పరిస్థితిపై సుప్రీం విచారణ

దేశంలో కరోనా వైరస్​ వేగంగా విస్తరిస్తున్న తరుణంలో.. జైళ్లలో ఖైదీల రద్దీ అంశాన్ని సుమోటోగా స్వీకరించి విచారణ చేపట్టింది సుప్రీంకోర్టు. కరోనా కట్టడికి చేపడుతున్న చర్యలపై స్పందించాలని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను ఆదేశించింది. మార్చి 20లోగా తమ స్పందన తెలపాలని, ఈ విషయంపై కోర్టుకు సాయం అందించేందుకు మార్చి 23లోగా ఒక అధికారిని నియమించాలని పేర్కొంది.

న్యాయ ప్రక్రియలో భాగంగా జువెనైళ్లు కస్టడీలో ఉన్నప్పుడు ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నారనే అంశాన్ని కూడా సుమోటోగా స్వీకరించి విచారణ చేపట్టింది సుప్రీం ధర్మాసనం.

ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనాను నియంత్రించేందుకు భారత్​లోని కొన్ని రాష్ట్రాలు ముమ్మర చర్యలు తీసుకుంటుంటే.. మరికొన్ని మాత్రం స్పందించడం లేదనే విషయం తమ దృష్టికి వచ్చినట్లు సుప్రీం తెలిపింది. ప్రజలు గుమిగూడటం ద్వారా కరోనా వ్యాప్తి పెరుగుతుందని హెచ్చరించింది.

వాదనలు ప్రత్యక్షప్రసారం

కరోనా వ్యాప్తి నేపథ్యంలో కోర్టులో అనవసరమైన రద్దీ సృష్టించవద్దని అత్యున్నత న్యాయస్థానం ఇప్పటికే స్పష్టం చేసింది. ఫలితంగా సర్వోన్నత న్యాయస్థానంలో ప్రజల తాకిడి తగ్గింది. ఈ నేపథ్యంలో సుప్రీంలో కార్యకలాపాలను ప్రత్యక్ష ప్రసారం చేయాలని పిటిషన్ దాఖలు చేశారు ఆర్ఎస్​ఎస్ మాజీ సిద్ధాంతకర్త గోవిందాచార్య. న్యాయవ్యవస్థలో ఉన్న సాంకేతికతను వినియోగించుకునేందుకు కరోనా వైరస్​ రూపంలో మంచి అవకాశం లభించిందని పేర్కొన్నారు.

గతంలో అయోధ్య భూవివాదం కేసు విచారణ సందర్భంగానూ సుప్రీంలో వాదనలు ప్రత్యక్ష ప్రచారం చేయాలని ఈయనే వ్యాజ్యం వేశారు.

ఇదీ చూడండి: పార్లమెంట్​లో రాహుల్ ప్రశ్నకు భాజపా స్ట్రాంగ్​ పంచ్​

Last Updated : Mar 16, 2020, 4:40 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.