ETV Bharat / bharat

కరోనా విలయం-3 రోజుల్లో లక్ష కేసులు

దేశంలో కరోనా మహమ్మారి కరాళ నృత్యం చేస్తోంది. రోజువారీ కేసుల పెరుగుదలలో బ్రెజిల్​ను వెనక్కినెట్టి రెండో స్థానానికి చేరుకుంది భారత్‌. ఒక్క రోజు కేసుల్లో అత్యధికంగా 34,884 కేసులు నమోదయ్యాయి. కేవలం మూడు రోజుల్లోనే లక్ష కేసులు నిర్ధరణ కావటం ఆందోళన కలిగిస్తోంది.

COVID-19
కరోనా విలయం-3 రోజుల్లో లక్ష కేసులు
author img

By

Published : Jul 19, 2020, 6:22 AM IST

Updated : Jul 19, 2020, 6:50 AM IST

దేశంలో కొవిడ్‌ మహాఉద్ధృతి కొనసాగుతూనే ఉంది. కేవలం 3 రోజుల్లోనే లక్షకు పైగా కేసులు నమోదయ్యాయి. రోజువారీ కరోనా కేసుల పెరుగుదలలో బ్రెజిల్‌ను వెనక్కినెట్టి భారత్‌ రెండో స్థానానికి చేరింది. 24 గంటల్లో అక్కడ 31,340 కేసులు నమోదు కాగా భారత్‌లో 34,884 కొత్త కేసులొచ్చాయి. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ లెక్కల ప్రకారం దేశంలో కేసుల సంఖ్య శనివారం నాటికి 10.38 లక్షలకు చేరింది. వరుసగా మూడో రోజు 32 వేలకు పైగా కేసులు నమోదు కాగా 600కి పైగా మరణాలు సంభవించాయి.

రాష్ట్రాల్లో ఉద్ధృతి..

మహారాష్ట్ర, తమిళనాడులో కేసుల ఉద్ధృతిలో ఏమాత్రం తగ్గుదల కనిపించడం లేదు. మహారాష్ట్రలో 24 గంటల్లో 671 మంది మృతి చెందారు. మొత్తం కేసుల సంఖ్య 3 లక్షలకు చేరువైంది. రోజూ 60 మేర మరణాలు నమోదయ్యే తమిళనాడులో ఆ సంఖ్య 79కి చేరింది. గత మూడు రోజులుగా తమిళనాడులో యాక్టివ్‌ కేసుల కంటే కోలుకున్నవారు అధికంగా ఉండగా శనివారం పరిస్థితి అందుకు విరుద్ధంగా మారింది. మరోవైపు కర్ణాటకలో తీవ్రత నానాటికీ పెరిగిపోతోంది. కేసులు, మరణాలు ప్రతిరోజూ గరిష్ఠ రికార్డును నమోదు చేస్తున్నాయి. నాలుగైదు రోజులుగా మహారాష్ట్ర తర్వాత అత్యధిక మరణాలు ఇక్కడే నమోదవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లోనూ కేసుల ఉద్ధృతి అనూహ్యంగా పెరుగుతోంది. దిల్లీ, రాజస్థాన్‌, అసోంలలో మినహా అన్ని రాష్ట్రాల్లో యాక్టివ్‌ కేసులే అధికంగా నమోదయ్యాయి.

COVID-19
కరోనా కేసుల వివరాలు

దేశ రాజధానిలో..

దిల్లీలో మరోసారి మరణాలు, కేసులు తగ్గాయి. 24 గంటల్లో కేసులు దాదాపు 200 వరకు తగ్గగా, మరణాలు 26కి పరిమితం అయ్యాయి. అయితే ఇక్కడ అత్యధికంగా యాంటీజెన్‌ పరీక్షలు నిర్వహిస్తుండటం వల్లే పాజిటివ్‌ కేసులు ఎక్కువ కనిపించడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. దిల్లీలో దాదాపు నెల రోజుల్లో 3.05 లక్షల యాంటీజెన్‌ పరీక్షలు నిర్వహించగా అందులో 2.85 లక్షల మందికి నెగెటివ్‌ వచ్చింది. అందులో 1,670 మందికి మళ్లీ ఆర్‌టీపీసీఆర్‌ పరీక్షలు నిర్వహించగా 262 మందికి పాజిటివ్‌ వచ్చింది. అంటే యాంటీజెన్‌ టెస్టుల్లో నెగెటివ్‌గా తేలినవారిలో 15.68% మందికి ఆర్‌టీపీసీఆర్‌లో పాజిటివ్‌ రావడం ఆందోళన కల్గిస్తోంది. ఇలా పాజిటివ్‌ ఉండీ యాంటీజన్‌ టెస్టుల్లో నెగెటివ్‌గా తేలినవారు తమకు ఏమీ కాలేదన్న ఉద్దేశంతో బయట తిరిగితే వైరస్‌ సంక్రమణం పెరిగిపోయి పరిస్థితులు ప్రమాదకరంగా మారే ప్రమాదం ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

  • దేశవ్యాప్తంగా కొవిడ్‌ బారిన పడినవారిలో శనివారం 671 మంది ప్రాణాలు కోల్పోయారు.శనివారం నాటికి మరణాల రేటు 2.53%గా ఉంది.
  • దేశంలో రికవరీ రేటు శనివారం స్వల్పంగా తగ్గి 62.94%కి చేరింది. 5 రోజులుగా ఇది 63 శాతానికి పైగా ఉంది.
  • బ్రెజిల్‌లో రోజువారీ కేసుల వృద్ధిరేటు 1.65% ఉంటే భారత్‌లో అది 3.47%గా నమోదైంది. దీన్నిబట్టి మరో నెల రోజుల్లో కేసుల సంఖ్యాపరంగా భారత్‌ ప్రపంచంలో రెండోస్థానానికి చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి.
  • దేశంలో శుక్రవారం నాటికి 1,34,33,742 కొవిడ్‌ నిర్ధారణ పరీక్షలు జరిపారు.

కొవిడ్‌ బాధితుల్లో ఆరు క్లస్టర్లుగా వ్యాధి లక్షణాలు

కొవిడ్‌-19 బాధితుల్లో వ్యాధి లక్షణాలను ఆరు భిన్న క్లస్టర్లుగా శాస్త్రవేత్తలు వర్గీకరించారు. ఒక్కోదానిలో ఒక్కో శ్రేణి రుగ్మతలు కనిపిస్తాయి. కరోనా బాధితులను మెరుగ్గా గుర్తించి, పర్యవేక్షించేలా వైద్యులకు ఇది వీలు కలిగిస్తుంది. లండన్‌లోని కింగ్స్‌ కాలేజీకి చెందిన శాస్త్రవేత్తలు ఈ పరిశోధన చేశారు. మార్చి, ఏప్రిల్‌ నెలల్లో అమెరికా, బ్రిటన్‌లో 1600 మంది కొవిడ్‌ బాధితులను ఒక యాప్‌ ద్వారా పర్యవేక్షించి, ఈ మేరకు తేల్చారు. దీని ప్రకారం బాధితుల్లో రోగ లక్షణాల క్లస్టర్లు ఇలా ఉన్నాయి.

  1. జ్వరం లేకుండా ఫ్లూ తరహా లక్షణాలు: ఈ విభాగంలోని బాధితులకు వాసన సామర్థ్యం తగ్గిపోవడం, కండరాల నొప్పులు, దగ్గు, గొంతులో నొప్పి, ఛాతీలో నొప్పి ఉంటాయి. జ్వరం ఉండదు.
  2. జ్వరంతో ఫ్లూ తరహా లక్షణాలు: తలనొప్పి, రుచి సామర్థ్యం తగ్గిపోవడం, దగ్గు, గొంతు నొప్పి, గొంతు బొంగురు పోవడం, జ్వరం, ఆకలి మందగించడం ఉంటాయి.
  3. జీర్ణాశయ సంబంధ రుగ్మతలు: ఈ క్లస్టర్‌లోని వారికి తలనొప్పి, వాసన సామర్థ్యం తగ్గిపోవడం, ఆకలి మందగించడం, డయేరియా, గొంతులో నొప్పి, ఛాతీలో నొప్పి ఉంటాయి. దగ్గు మాత్రం ఉండదు.
  4. అలసటతో కూడిన తీవ్రస్థాయి విభాగం-1: వాసన సామర్థ్యం తగ్గిపోవడం, దగ్గు, తలనొప్పి, జ్వరం, గొంతు బొంగురుపోవడం, ఛాతీలో నొప్పి, అలసట.
  5. తికమకతో కూడిన తీవ్రస్థాయి విభాగం-2: వీరిలో 'తీవ్రస్థాయి విభాగం-1'లోని లక్షణాలన్నీ కనిపిస్తాయి. వీటికితోడు ఆకలి మందగించడం, గొంతు నొప్పి, తికమకపడటం, కండరాల నొప్పి తలెత్తుతాయి.
  6. ఉదరం, శ్వాసకోశంలో నొప్పితో కూడిన తీవ్రస్థాయి విభాగం-3: తలనొప్పి, వాసన సామర్థ్యం తగ్గిపోవడం, ఆకలి మందగించడం, దగ్గు, జ్వరం, గొంతు బొంగురుపోవడం, గొంతులో నొప్పి, ఛాతీలో నొప్పి, నిస్సత్తువ, తికమకపడటం, కండరాల నొప్పి, ఆయాసం, డయేరియా, కడుపులో నొప్పి కనిపిస్తున్నాయి.

రెండు నెలల్లో గరిష్ఠ స్థాయికి కరోనా

మన దేశంలో కరోనా కేసుల సంఖ్య సెప్టెంబరు నెల మధ్య నాటికి అత్యధిక స్థాయికి చేరుకొని ఆ తర్వాత క్రమంగా తగ్గుముఖం పడతాయని పబ్లిక్‌ హెల్త్‌ ఫౌండేషన్‌ ఆఫ్‌ ఇండియా అధ్యక్షుడు, ప్రముఖ వైద్య నిపుణుడు, పద్మభూషణ్‌ ప్రొ.కె.శ్రీనాథ్‌ రెడ్డి తెలిపారు. అయితే, ప్రభుత్వం, ప్రజలు వైరస్‌ వ్యాప్తిని నిరోధించేందుకు బాధ్యతాయుతంగా అత్యంత కట్టుదిట్టమైన చర్యలు, జాగ్రత్తలు తీసుకుంటేనే ఇది సాధ్యమవుతుందని 'పీటీఐ' వార్తా సంస్థకిచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. దేశంలో మహమ్మారి బాధితుల సంఖ్య 10లక్షలకు పైగా చేరుకొన్న నేపథ్యంలో వైరస్‌ విజృంభిస్తున్న తీరు, మరణాల సంఖ్య పెరగటంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. కరోనా కేసులు రెండు నెలల్లో తగ్గుముఖం పడతాయని మీరు భావిస్తున్నారా అన్న ప్రశ్నకు ఆయన స్పందిస్తూ...'ప్రతి ఒక్కరూ తమ బాధ్యతగా మాస్కులు ధరించటం, పరిశుభ్రతా చర్యలతో పాటు అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటే సాధ్యమే. ప్రభుత్వాల చర్యలపైనా ఇది ఆధారపడి ఉంటుంది' అని ఆయన స్పష్టం చేశారు. లాక్‌డౌన్‌ సడలింపులు ప్రారంభమైన మే నెల 3వ తేదీ నుంచి ఇంటింటికీ సర్వే నిర్వహించటం, వైరస్‌ లక్షణాలున్న వ్యక్తులను గుర్తించటం, పరీక్షలు చేసి బాధితుల్ని ఐసోలేషన్‌ కేంద్రాలకు తరలించటం, కాంటాక్ట్‌ ట్రేసింగ్‌ వంటివి భారీ ఎత్తున చేసి ఉండాల్సిందని అభిప్రాయపడ్డారు. గ్రామాలు, చిన్న చిన్న పట్టణాలకు వైరస్‌ విస్తరించకుండా చర్యలు తీసుకోవటం తక్షణ అవసరమని శ్రీనాథ్‌ రెడ్డి తెలిపారు.

ఇదీ చూడండి: దిల్లీ ఎయిమ్స్​లో 'కొవాగ్జిన్'​​ మానవ ప్రయోగాలకు అనుమతి

Last Updated : Jul 19, 2020, 6:50 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.