ETV Bharat / bharat

విదేశాల్లోని భారతీయులను తీసుకొచ్చేందుకు కేంద్రం చర్యలు

కరోనా వ్యాప్తితో అన్నిరంగాలు మూతపడటం వల్ల.. ఎక్కడివారక్కడే చిక్కుకుపోయారు. ఈ క్రమంలో విదేశాల్లో ఉన్న భారతీయులను స్వదేశానికి రప్పించేందుకు కేంద్రం చర్యలు చేపట్టింది. ఈ మేరకు విదేశాల్లో ఉన్నవారి వివరాల సేకరణ కోసం ఓ ప్రత్యేక పోర్టల్​ను ఏర్పాటు చేసింది. ఆ వివరాల ఆధారంగా వారిని భారత్​కు తీసుకురావాలని నిర్ణయించింది.

Indian missions in UAE open online registration for its citizens who wish to fly home
విదేశీయుల్లోని భారతీయుల కోసం ప్రత్యేక ప్రణాళిక దిశగా కేంద్రం
author img

By

Published : Apr 30, 2020, 1:53 PM IST

కరోనా ప్రభావంతో విదేశాల్లో చిక్కుకుపోయిన భారతీయులను స్వదేశానికి తీసుకువచ్చేందుకు విదేశాంగ మంత్రిత్వ శాఖ ఏర్పాట్లను ముమ్మరం చేస్తోంది. ఈ మేరకు కేంద్రం ఒక విధాన నిర్ణయం తీసుకుంది. భారతీయులను తీసుకొచ్చేందుకు ఎయిర్‌ ఇండియా, వాయుసేన, నౌకాదళ సేవలు వినియోగించుకోనున్న కేంద్రం.. ఆయా దేశాల్లో ఎంత మంది ఉన్నారో తెలుసుకునేందుకు ప్రత్యేక రిజిస్ట్రేషన్‌ కార్యక్రమాన్ని చేపట్టింది.

ప్రత్యేక పోర్టల్​ ద్వారా..

ఈ మేరకు భారత రాయబార కార్యాలయాలకు ఆదేశాలు జారీ చేసిన విదేశాంగ శాఖ.. ఆయా దేశాల్లో ఉన్నవారి వివరాలను సేకరించాలని పేర్కొంది. ఏ దేశంలో ఎంతమంది ఉన్నారో, వారు ఏయే ప్రాంతాల్లో ఉన్నారో తేల్చాలని సూచించింది. తద్వారా అక్కడి పరిస్థితులను అంచనా వేయడానికి అవకాశముంటుందని భావించింది. ఇందుకోసం ఆయా దేశాలలోని భారతీయ రాయబార కార్యాలయాల ద్వారా ఓ ప్రత్యేక పోర్టల్​ను ఏర్పాటుచేసింది కేంద్రం. దీని ద్వారా భారత్​కు రావాలనుకున్న వారి వివరాలు సేకరించి.. తగిన ప్రణాళికలను సిద్ధం చేయచేయనుంది. దేశానికి రావాలనుకున్నవారు పోర్టల్​లో రిజిస్ట్రేషన్​ చేయించుకుని.. వివరాలు నమోదు చేసుకోవాలని అధికారులు పేర్కొన్నారు.

యూఏఈ నుంచి మొదలు..

భారతీయులు అధికంగా ఉన్న దుబాయ్‌ సహా.. గల్ఫ్‌ దేశాల్లో చిక్కుకున్న వారికోసం ప్రత్యేక దృష్టి పెట్టినట్లు విదేశాంగ శాఖ అధికారులు వెల్లడించారు. తొలుత యునైటెడ్​ అరబ్​ ఎమిరేట్స్​(యూఏఈ) నుంచి వివరాల సేకరణ ప్రారంభించిన కేంద్రం.. ఆయా దేశాల్లోని పరిస్థితుల ఆధారంగా నిర్ణయం తీసుకోనున్నారు. వీలైనంతవరకు ఎక్కువ మందిని సముద్ర మార్గం ద్వారానే తరలించే యోచనలో కేంద్రం ఉన్నట్లు తెలుస్తోంది.

ఇదీ చదవండి: విదేశాల్లోని భారతీయుల కోసం కేంద్రం 'మెగాప్లాన్​'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.