ETV Bharat / bharat

కరోనాపై పోరుకు 'ఉమ్మడి నియంత్రణ వ్యూహం' - భారత్​లో కరోనా కేసులు

కరోనా మహమ్మారిని దేశం నుంచి తరిమికొట్టేందుకు ప్రభుత్వం 'ఉమ్మడి నియంత్రణ వ్యూహాం' రూపొందించింది. భౌగోళిక నిర్బంధం దిశగా ప్రణాళిక సిద్ధం చేసింది. కరోనా వ్యాప్తి చెందిన ప్రాంతాల నుంచి ప్రజలు ప్రయాణాలు చేయకుండా చేసి వైరస్​ వ్యాప్తిని నిరోధించవచ్చని ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది.

COVID-19: Health ministry comes out with cluster containment strategy
కరోనాపై పోరుకు 'ఉమ్మడి నియంత్రణ వ్యూహం'
author img

By

Published : Apr 5, 2020, 6:32 AM IST

ప్రాణాంతక కరోనా ఇప్పటికే దేశం నలుమూలల విస్తరించింది. ఈ క్రమంలో చర్యలు ముమ్మరం చేస్తోంది ప్రభుత్వం. ఇందులో భాగంగా 'ఉమ్మడి నియంత్రణ ప్రణాళిక' రూపొందించింది. భౌగోళిక నిర్బంధం ద్వారా ప్రజలు ప్రయాణాలు చేయకుండా నిరోధించి వైరస్​ వ్యాప్తిని అడ్డుకోవచ్చని ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

కేరళ, మహారాష్ట్ర, రాజస్థాన్​, ఉత్తర్​ప్రదేశ్​, పంజాబ్​, కర్ణాటక, తెలంగాణ, దిల్లీ, లద్దాఖ్​ వంటి పలు రాష్ట్రాల్లో కరోనా కేసులు మరింత వ్యాప్తి చెందే ప్రమాదం ఉంది. ఈ మేరకు ప్రభుత్వం ఒక ఉమ్మడి నియంత్రణ ప్రణాళికను రూపొందించింది.

ప్రయాణాలే కారణం!

ఈ ప్రణాళిక ప్రకారం.. కరోనా కేసులను ముందుగా గుర్తించడం, పలు భౌగోళిక ప్రాంతాల మధ్య ఉండే గొలుసును విచ్ఛిన్నం చేయడం ద్వారా కొత్త ప్రాంతాలకు కరోనా వ్యాప్తి చెందకుండా నిరోధించవచ్చు. కరోనా సోకినవారు ప్రయాణాలు చేయడం వల్ల కేసులు పెరగుతున్నట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది.

211 జిల్లాల్లో...

ప్రస్తుతం దేశవ్యాప్తంగా 211 జిల్లాల్లో కరోనా విస్తరించిందని, మరింత వ్యాప్తి చెందే ప్రమాదముందని మంత్రిత్వ శాఖ వెల్లడించింది. కరోనా వ్యాప్తి, సామాజిక విస్తరణ, ప్రయాణ సంబంధిత కేసులను నివేదించడానికి భారత్​ ఒక వ్యూహాత్మక విధానాన్ని అనుసరిస్తున్నట్లు మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

ప్రణాళికలో భాగమే..

భౌగోళిక నిర్బంధంతో పాటు కరోనాపై ప్రజల్లో అవగాహన కల్పించడం, అనుమానితులను నిర్బంధ కేంద్రాల్లో ఉంచి పరీక్షలు నిర్వహించడం, సామాజిక దూరం పాటించడం, వంటి చర్యలను తీసుకోనున్నట్లు ఉమ్మడి నియంత్రణ వ్యూహంలో పేర్కొన్నారు.

ఇదీ చూడండి: ఐఏఎస్​ అధికారికి కరోనా- ప్రభుత్వం అప్రమత్తం​​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.