ETV Bharat / bharat

హైదరాబాద్​కు కేంద్ర బృందం- కరోనాపై క్షేత్రస్థాయి పరిశీలన - coronavirus in india live

కరోనాపై క్షేత్రస్థాయి పరిశీలన కోసం మరో నాలుగు బృందాలను ఏర్పాటు చేసింది కేంద్రం. వీటిని హైదరాబాద్, చెన్నై, అహ్మదాబాద్, సూరత్​ల్లో వైరస్ ప్రభావాన్ని పరిశీలించేందుకు పంపింది. లాక్​డౌన్​ వల్ల దేశంలో కరోనా కేసుల సంఖ్య తగ్గిందని లేకుంటే బాధితుల సంఖ్య లక్షకు చేరుకునేదని పేర్కొంది.

covid19
క్షేత్రస్థాయి పరిశీలన కోసం హైదరాబాద్​కు కేంద్ర బృందం!
author img

By

Published : Apr 24, 2020, 5:39 PM IST

దేశంలో కరోనా తీవ్రత, తీసుకుంటున్న చర్యలపై కేంద్ర ఆరోగ్య శాఖ పలు విషయాలు వెల్లడించింది. ఇప్పటికే వైరస్ తీవ్రత ఎక్కువున్న​ బంగాల్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటకల్లో ఆరు క్షేత్రస్థాయి బృందాలు పర్యటిస్తున్నాయి. అయితే రాష్ట్రాల్లో పరిస్థితులను పరిశీలించేందుకు మరో నాలుగు బృందాలను ఏర్పాటు చేసింది కేంద్రం.

ఈ బృందాలను హైదరాబాద్, చెన్నై, అహ్మదాబాద్, సూరత్​ల్లో వైరస్ ప్రభావాన్ని పరిశీలించేందుకు పంపించింది. అదనపు కార్యదర్శి స్థాయి అధికారుల నేతృత్వంలో ఈ బృందాలు పనిచేస్తాయి. నిపుణులతో కూడిన ఈ బృందాలు రాష్ట్రాల్లో పర్యటించి అవసరమైన మేరకు స్థానిక ప్రభుత్వాలకు సూచనలు చేస్తాయి.

5 లక్షలకు పైగా పరీక్షలు..

దేశంలో ఇప్పటివరకు 5,00,542 వైరస్ నిర్ధరణ పరీక్షలు చేసినట్లు సమాచారం. 9,45,000 మంది అనుమానితులను పరిశీలించినట్లు తెలుస్తోంది. కరోనాతో ప్రాణాలు కోల్పోయే రేటు దేశంలో 3.1 శాతమని అంచనా వేసింది కేంద్రం.

లాక్​డౌన్​ లేకపోతే..లక్ష కేసులు!

"లాక్​డౌన్ నిర్ణయాన్ని సరైన సమయంలో తీసుకోవడం వల్ల దేశంలో కరోనా వ్యాప్తి తగ్గింది. లాక్​డౌన్​ లేనట్లయితే ఇప్పటికే లక్షకు పైగా కేసులు నమోదయ్యేవి. ప్రస్తుతం కేసులు రెట్టింపయ్యేందుకు 10 రోజుల సమయం పడుతోంది. ఈ నేపథ్యంలో జిల్లాలు, రాష్ట్రాల వారిగా పర్యవేక్షణ చేపట్టాలి. వైరస్ సామాజికంగా వ్యాప్తి చెందకుండా అరికట్టాలి." - కేంద్ర ఆరోగ్యశాఖ

24 గంటల్లో 491 మందికి నయం..

ఒక్కరోజు వ్యవధిలో 491 మందికి వైరస్ నయమైందని.. దేశంలో రికవరీ రేటు 20.58 శాతంగా ఉన్నట్లు ఆరోగ్యశాఖ తెలిపింది.

80 జిల్లాల్లో..

గత 14 రోజుల్లో 80 జిల్లాల్లో ఇప్పటివరకు ఒక్క కేసు కూడా నమోదు కాలేదని అధికారులు తెలిపారు. 28 రోజుల్లో 15 జిల్లాల్లో వైరస్ వ్యాపించలేదని పేర్కొన్నారు.

ఇదీ చూడండి: ఆ మందును పిచికారీ చేస్తే శరీరానికి మంచిదేనా?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.