బెంగళూరులో విజృంభిస్తున్న గంజాయి అక్రమ వ్యాపారులపై వేటు వేసే పనిలోపడ్డారు పోలీసులు. అయితే, శుక్రవారం పోలీసులను కష్టపెట్టకుండానే మరో గంజాయి కేసు బయటపడింది. ఓ బాలుడికి వచ్చిన పార్సిల్లో గంజాయి పొట్లాలు చూసి తల్లిదండ్రులే పోలీసులకు అప్పజెప్పారు.
సిలికాన్ సిటీకి చెందిన 14 ఏళ్ల బాలుడి పేరుపై ఓ కొరియర్ వచ్చింది. పార్సిల్ తీసుకుని తెరచి చూశారు తల్లిదండ్రులు. ఆ డబ్బా నిండా గంజాయి ప్యాకెట్ల కనిపించేసరికి ఒళ్లంతా చెమటలు పట్టాయి. వెంటనే కబ్బన్ పార్క్ పోలీసులకు సమాచారమిచ్చారు. అభంశుభం తెలియని పిల్లలను.. డ్రగ్స్ మాఫియా అక్రమ దందాలోకి లాగుతోందని తీవ్ర ఆందోళన చెందుతున్నారు.
ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు డోంజో యాప్ ద్వారా గంజాయి ఆర్డర్ చేసినట్లు గుర్తించారు. బాలుడి మెయిల్ ఐడీతో తానే ఆర్డర్ చేసి ఉంటాడని అనుమానిస్తున్నారు. అతడ్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
ఇదీ చదవండి: 'సినీ తారలే.. గంజాయి రెగ్యులర్ కస్టమర్లు!'