కరోనా వైరస్‌ను నియంత్రించడానికి కేంద్రం తీసుకుంటున్న చర్యలపై అసహనం వ్యక్తం చేసింది కాంగ్రెస్. ప్రభుత్వ తీరును ఆ పార్టీ నేత రాహుల్ గాంధీ తప్పుబట్టారు. కరోనా ముప్పును తీవ్రంగా పరిగణించి, మరింత ఉత్తమంగా సిద్ధం కావాల్సి ఉండేదని అభిప్రాయపడ్డారు. మాస్కులు అందించాలని ట్విట్టర్ ద్వారా ప్రధానిని అభ్యర్థించిన ఓ వైద్యుడి ట్వీట్‌కు బదులుగా స్పందించారు రాహుల్.
-
I am feeling sad, because this was completely avoidable. We had time to prepare. We should have taken this threat much more seriously and have been much better prepared. #CoronavirusPandemic https://t.co/dpRTCg8No9
— Rahul Gandhi (@RahulGandhi) March 24, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">I am feeling sad, because this was completely avoidable. We had time to prepare. We should have taken this threat much more seriously and have been much better prepared. #CoronavirusPandemic https://t.co/dpRTCg8No9
— Rahul Gandhi (@RahulGandhi) March 24, 2020I am feeling sad, because this was completely avoidable. We had time to prepare. We should have taken this threat much more seriously and have been much better prepared. #CoronavirusPandemic https://t.co/dpRTCg8No9
— Rahul Gandhi (@RahulGandhi) March 24, 2020
"చాలా బాధాకరంగా ఉంది. ఎందుకంటే ఇవి పూర్తిగా నివారించదగిన పరిస్థితులు(మాస్కుల కొరతనుద్దేశించి). మనం సిద్ధం కావడానికి సమయం లభించింది. ఈ ముప్పును మరింత తీవ్రంగా పరిగణించి సంసిద్ధంగా ఉండాల్సింది."
-రాహుల్ గాంధీ, కాంగ్రెస్ నేత
మరోవైపు కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణ్‌దీప్ సుర్జేవాలా సైతం ప్రభుత్వ తీరుపై విమర్శలు చేశారు. వైరస్ బాధితులకు చికిత్సనందించే వైద్య సిబ్బంది వ్యక్తిగత రక్షణార్థం ప్రభుత్వం సరైన పరికరాలు అందించలేదని ఆరోపించారు. ఫిబ్రవరి 1 నుంచి మార్చి 2 మధ్య సిబ్బందికి ఈ పరికరాలు ఇవ్వడంలో కేంద్రం నేరపూరితంగా వ్యవహరించినట్లు పేర్కొన్నారు.
"ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు.. కరోనాపై పోరాడుతున్న డాక్టర్లు, నర్సులు, వైద్య నిపుణుల సేవలను అభినందిస్తూ మార్చి 22 సాయంత్రం 5 గంటలకు చప్పట్లు కొట్టాం. అయితే వారికి కావాల్సింది చప్పట్లు కాదు. రక్షణ కావాలి. వారు కోరుకుంటున్నది కూడా అదే. ఐదు రోజుల క్రితం(మార్చి 19 నాటికి) వరకు భారత్‌లో అందుబాటులో ఉన్న పరికరాలు, వెంటిలేటర్లను విదేశాలకు ఎగుమతి చేసేందుకు వాణిజ్య శాఖ అనుమతి ఇచ్చింది. మీ మంత్రులే ఈ నేరపూరిత చర్యలకు పాల్పడ్డారు."-రణ్‌దీప్ సుర్జేవాలా, కాంగ్రెస్ ప్రధాన ప్రతినిధి
భారత్‌కు ఇప్పుడు 7 లక్షల హెజ్మత్ సూట్లు, 60 లక్షల ఎన్-95 మాస్కులు, కోటి 'మూడు లేయర్ల మాస్కులు' అత్యవసరమని సుర్జేవాలా అన్నారు.
ఇదీ చదవండి: కరోనా ఎఫెక్ట్- వీడియో కాన్ఫరెన్స్‌లోనే పెళ్లి