ETV Bharat / bharat

భారత్​-చైనా మధ్య దోస్తీ కుదిరేనా? - india china border talks

తూర్దు లద్దాఖ్​ సరిహద్దులో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులను తగ్గించేందుకు భారత్​-చైనా మధ్య నాలుగో విడత కార్ప్స్​ కమాండర్​ స్థాయి చర్చలు జరుగుతున్నాయి. గతంలో కుదిరిన ఏకాభిప్రాయం మేరకు ఇప్పటికే పలు కీలక ప్రాంతాల నుంచి బలగాలను ఉపసంహరించుకున్నాయి ఇరు దేశాలు. వాస్తవాధీన రేఖ వెంబడి బలగాలను పూర్తి స్థాయిలో విరమించుకునే విషయంపై చర్చించేందుకు నేడు మరోమారు భేటీ అయ్యాయి.

Corps Commander-level talks between India, China begin at Chushul Border post in Eastern Ladakh
భారత్​-చైనా మధ్య దోస్తీ కుదిరేనా!
author img

By

Published : Jul 14, 2020, 1:40 PM IST

భారత్​-చైనా మధ్య నాలుగో విడత కార్ప్స్​ కమాండర్​ స్థాయి చర్చలు లద్దాఖ్​లోని త్రిశూల్​లో జరుగుతున్నాయి. సరిహద్దులో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులను తగ్గించేందుకు కీలక ప్రదేశాల నుంచి ఇప్పటికే బలగాలను ఉపసంహరించుకున్నాయి ఇరు దేశాలు. గత చర్చల్లో కుదిరిన ఏకాభిప్రాయం మేరకు ఈ ప్రక్రియ పూర్తి చేశాయి. ఇప్పుడు వాస్తవాధీన రేఖ వెంబడి బలగాలను పూర్తి స్థాయిలో విరమించుకుని మునపటిలా సాధారణ పరిస్థితులు నెలకొల్పే విషయంపై చర్చించేందుకు ఇరు దేశాల సైనికాధికారులు సమావేశమయ్యారు.

పరస్పర అంగీకారం మేరకు మొదటి విడత బలగాల ఉపసంహరణలో భాగంగా గల్వాన్​ లోయ, హాట్​ స్ప్రింగ్స్​, పెట్రోలింగ్ పాయింట్​-15, ఫింగర్​-4, ఫింగర్-5 ప్రాంతాల నుంచి 2 కీ.మీ మేర సైనికులను వెనక్కి మళ్లించింది చైనా. భారత్​ కూడా తమ బలగాలను వెనక్కి రప్పించింది.

సైనికులు లేని ప్రాంతాలను తాత్కాలిక నాన్​-పెట్రోలింగ్​ జోన్లుగా ఇరు దేశాలు గుర్తిస్తాయి. అక్కడ బలగాలను మోహరించవు.

జాతీయ భద్రతా సలహాదారు అజిత్​ డోభాల్​, చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీలు జులై 5న రెండు గంటల పాటు ఫోన్లో సంభాషించిన అనంతరం జులై 6 నుంచి బలగాల ఉపసంహరణ ప్రక్రియను ప్రారంభించాయి భారత్​-చైనా.

ఇదీ చూడండి: 'ఆత్మ నిర్బర్ భారత్..​ ఒంటరివాదానికి సూచన కాదు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.