ETV Bharat / bharat

21 రోజులు దేశమంతా మూసివేత - Narendra modi

దేశంలో కరోనా విజృంభిస్తోంది. ఈ నేపథ్యంలో ముందుగానే తగు జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి. కరోనాపై జాతినుద్దేశించి మాట్లాడిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలకు పలు సూచనలు చేశారు. లాక్​డౌన్​ ఉల్లంఘిస్తే బలప్రయోగం తప్పదని హెచ్చరించారు. మోదీ ప్రసంగంలోని ఆంతర్యం ఏమిటి? ప్రత్యేక కథనం మీ కోసం...

Coronavirus : Modi to address nation
21 రోజులు దేశమంతా మూసివేత
author img

By

Published : Mar 25, 2020, 6:56 AM IST

కరోనా వ్యాప్తి నియంత్రణకు నేటి నుంచి కఠిన ఆంక్షలు అమలుకానున్నాయి. దేశవ్యాప్తంగా లాక్​డౌన్​ విధిస్తున్నట్లు ప్రకటించారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ఇది కర్ఫ్యూలాంటి పరిస్థితి అని, ఉల్లంఘిస్తే బలప్రయోగం తప్పదని ప్రజలను హెచ్చరించారు. అందరూ ఇళ్లకే పరిమితం కావాలని, ప్రాణాలు రక్షించుకోవడానికి మరో మార్గం లేదని స్పష్టం చేశారు.

దేశవ్యాప్త లాక్‌డౌన్‌ సమయంలో ఇంటి గుమ్మం ముందు ఒక లక్ష్మణరేఖ గీసుకోండి. ఇంటి నుంచి బయట పెట్టే ఒక్క అడుగే కరోనాను మీ ఇంటికి తీసుకొస్తుందన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి. కరోనా సోకిన వారిలో ఇన్‌ఫెక్షన్‌ లక్షణాలు కనిపించడానికి చాలా రోజులు పడుతుంది. ఆ మధ్యలో తెలిసో తెలియకో చాలామందికి ఆ వ్యాధిని వ్యాప్తి చేస్తారు.

ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) అంచనా ప్రకారం ఈ మహమ్మారి సోకిన వ్యక్తి వారం పదిరోజుల్లో దాన్ని వందల మందికి అంటిస్తారు. ప్రపంచంలో కరోనా సాంక్రమిక రోగుల సంఖ్య తొలిసారి లక్షకు చేరుకోవడానికి 67 రోజులు పడితే, రెండో లక్షకు చేరుకోవడానికి 11 రోజులు, మూడో లక్షకు ఎగబాకడానికి నాలుగే రోజులు పట్టింది. దీన్ని బట్టి ఈ వైరస్‌ ఎంత వేగంగా విస్తరిస్తోందో అర్థంచేసుకోవచ్చు. అందువల్ల.. సామాజిక దూరాన్ని ప్రధానమంత్రి నుంచి పల్లె వరకూ అందరూ పాటించాలి. ‘ప్రాణం ఉంటేనే ప్రపంచం’ అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి.

Coronavirus : Modi to address nation
21 రోజులు దేశమంతా మూసివేత

కరోనా మహమ్మారి కట్టడికి మంగళవారం అర్ధరాత్రి నుంచి 21 రోజులపాటు దేశాన్ని పూర్తిగా లాక్‌డౌన్‌ చేస్తున్నట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించారు. నిర్బంధం అమలయ్యే ఈ సమయంలో దేశంలో ఎవరూ ఇంటి నుంచి బయటికి అడుగు పెట్టకూడదని నిర్దేశించారు. వైరస్‌ విజృంభణను అరికట్టడానికి ఇంతకుమించి మార్గం లేదని స్పష్టంచేశారు. ఈ సుదీర్ఘ నిర్బంధానికి అందరూ సహకరించాలని కోరారు. దేశ ప్రజల ప్రాణాలకు తొలి ప్రాధాన్యం ఇస్తూ ఈ నిర్ణయం తీసుకున్నామని, దీన్ని ప్రధాన మంత్రి నుంచి గ్రామ పంచాయతీ స్థాయి వరకూ అందరూ పాటించాల్సిందేనని స్పష్టంచేశారు. కరోనా విస్తృతి నానాటికీ పెరుగుతున్న నేపథ్యంలో ఆయన మంగళవారం రాత్రి 8 గంటలకు జాతినుద్దేశించి చేసిన ప్రసంగంలో ఈ విషయాన్ని స్పష్టంచేశారు. ప్రధాని ప్రసంగం ఆయన మాటల్లోనే..

జనతా కర్ఫ్యూతో సత్తా చాటాం

ఈ నెల 22న జనతా కర్ఫ్యూను విజయవంతం చేయడానికి ప్రతి భారతీయుడూ కృషి చేశారు. పిల్లలు, వృద్ధులు, ధనికులు, పేదలు, మధ్య తరగతివారు.. ఇలా సమాజంలోని ప్రతి ఒక్కరూ ఈ పరీక్షా సమయంలో కలిసి వచ్చారు. దేశానికి సంకట స్థితి ఎదురైనప్పుడు, మానవత్వానికి కష్టం వచ్చినప్పుడు భారతీయులు ఎంత బాధ్యతాయుతంగా, కలిసికట్టుగా ఎదుర్కోగలరన్నది చేతల్లో చూపాం. అందుకోసం కృషిచేసిన ప్రతి ఒక్కరూ ప్రశంసనీయులే

Coronavirus : Modi to address nation
21 రోజులు దేశమంతా మూసివేత

సమర్థ దేశాలూ కుదేలు

సమర్థ దేశాలనూ ఆ మహమ్మారి పూర్తిగా నిర్వీర్యం చేసింది. అలా అని ఆ దేశాలు తమవంతు ప్రయత్నం చేయలేదని కాదు. వారి దగ్గర వనరులు లేకా కాదు. అన్నీ ఉన్నచోట కూడా ఆ వైరస్‌ వేగంగా విస్తరిస్తోంది. పూర్తిగా సన్నద్ధమై, తీవ్రంగా శ్రమించినా ఆ దేశాల్లో సవాళ్లు పెరుగుతూనే ఉన్నాయి. చైనా, అమెరికా, ఫ్రాన్స్‌, జర్మనీ, స్పెయిన్‌, ఇటలీ, ఇరాన్‌ లాంటి అనేక దేశాల్లో కరోనా మొదలైన వెంటనే అక్కడి ప్రజల ఆరోగ్య పరిస్థితులు దారుణంగా దెబ్బతిన్నాయి. ఇటలీ, అమెరికాల వైద్యరంగం, ఆసుపత్రులు, ఆర్థిక, ఆధునిక వనరులు ప్రపంచంలోనే మిన్నగా ఉన్నాయి. అయినప్పటికీ ఆ దేశాలు కరోనా ప్రభావాన్ని తగ్గించలేకపోయాయి.

అర్ధరాత్రి నుంచి లాక్‌డౌన్‌

వైద్య నిపుణులు, ఇతర దేశాల మేధావుల సూచనలను దృష్టిలో ఉంచుకొని ఈ రోజు (మంగళవారం) అర్ధరాత్రి 12 గంటల నుంచి దేశంలో సంపూర్ణ లాక్‌డౌన్‌ అమలు చేయాలని నిర్ణయించాం. భారతదేశాన్ని కాపాడుకోవడానికి, ప్రతి పౌరుడిని రక్షించుకోవడానికి, మిమ్మల్ని, మీ కుటుంబసభ్యులను కాపాడటానికి ఇంటి నుంచి బయటికి రావడాన్ని పూర్తిగా నిషేధిస్తున్నాం. దేశంలోని ప్రతి రాష్ట్రం, కేంద్రపాలిత ప్రాంతం, పల్లెలు, పట్టణాలు, నగరాలన్నీ లాక్‌డౌన్‌ అవుతాయి. ఒకరకంగా ఇది కర్ఫ్యూ. జనతా కర్ఫ్యూ కన్నా కఠినం. అవసరమైతే బల ప్రయోగమూ జరుగుతుంది. ఈ లాక్‌డౌన్‌ ద్వారా తలెత్తే ఆర్థిక భారాన్ని దేశం భుజాలకెత్తుకోవాల్సి వస్తుంది. అయినా ప్రతి భారతీయుడిని రక్షించుకోవడానికి కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, స్థానిక ప్రభుత్వం దీనికే ప్రాధాన్యమిస్తున్నాయి. దీనికి అందరూ సహకరించాలని చేతులు జోడించి ప్రార్థిస్తున్నా. దేశంలో ఎక్కడున్నవారు అక్కడే ఉండండి.

Coronavirus : Modi to address nation
21 రోజులు దేశమంతా మూసివేత

లేకుంటే 21 ఏళ్లు వెనక్కిపోతాం

గతవారం మీ ముందుకొచ్చి మాట్లాడినప్పుడు మీ నుంచి కొన్ని వారాలు కావాలని కోరుకుంటున్నట్లు చెప్పా. అందులో భాగంగానే ఇప్పుడు మూడు వారాలు.. అంటే 21 రోజులు ప్రతి కుటుంబం ఇంట్లో ఉండటం అత్యవసరం. నిపుణుల అభిప్రాయం ప్రకారం వైరస్‌ వ్యాప్తి గొలుసుకట్టును తెగ్గొట్టడానికి 21 రోజుల లాక్‌డౌన్‌ తప్పనిసరి. అన్ని రోజులు ఇంట్లో ఉండకపోతే దేశం, మీ కుటుంబం 21 సంవత్సరాలు వెనక్కి పోతుంది. ప్రధాన మంత్రిగా కాదు.. మీ కుటుంబ సభ్యుడిగా ఈ విషయం చెబుతున్నా.

ప్రస్తుత సంకట స్థితిలో ప్రతి భారతీయుడూ ప్రభుత్వ ఆదేశాలను పాటిస్తాడని నాకు విశ్వాసం ఉంది. 21 రోజుల లాక్‌డౌన్‌.. చాలా పెద్ద సమయం. కానీ మీ జీవిత రక్షణకోసం... కుటుంబ సంక్షేమం కోసం ఇది చాలా ముఖ్యం. ఇదొక్కటే మన దగ్గర ఉన్న మార్గం. ప్రతి భారతీయుడు దీన్ని విజయవంతంగా ఎదుర్కొని ఈ కష్ట కాలం నుంచి విజయవంతంగా బయటికొస్తారని నాకు సంపూర్ణ విశ్వాసం ఉంది. మీకోసం, మీ కుటుంబ సభ్యులకోసం ఆత్మవిశ్వాసంతో చట్టాలను అనుసరిస్తూ పూర్తిగా సంయమనంతో విజయ సంకల్పంతో మనం అంతా ఈ బంధానలను స్వీకరిద్దాం.

Coronavirus : Modi to address nation
21 రోజులు దేశమంతా మూసివేత

వారి కోసం ప్రార్థించండి

ముప్పు ఉన్నా ముందుండి పనిచేస్తున్న డాక్టర్లు, ఇతర వైద్య సిబ్బంది గురించి ఆలోచించండి. ఈ మహమ్మారి నుంచి ఒక్కో జీవితాన్ని కాపాడటానికి రాత్రింబవళ్లు ఆసుపత్రుల్లో పనిచేస్తున్న వీరితోపాటు, యాజమాన్యాలు, ఆంబులెన్స్‌ డ్రైవర్లు, వార్డ్‌బాయ్‌లు, పారిశుద్ధ్య సిబ్బంది గురించి ఆలోచించండి. ఇతరుల కోసం పనిచేస్తున్న వారికోసం ప్రార్థించండి. మీకు సరైన సమాచారం అందిస్తూ మీకోసం 24 గంటలు పనిచేసే మీడియా ప్రతినిధుల గురించి, రాత్రింబవళ్లు విధులు నిర్వర్తిస్తున్న పోలీసుల గురించి ఆలోచించండి’’ అని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు.

సామాజిక దూరమే మార్గం

కరోనా ప్రభావం ఎక్కువగా ఉన్న దేశాల అనుభవాల ద్వారా ఒక్క విషయం వెల్లడైంది. కరోనాను సమర్థంగా ఎదుర్కోవడానికి ఉన్న ఏకైక మార్గం.. సామాజిక దూరాన్ని పాటించడం. అంటే.. ఒకరికొకరు దూరంగా ఉండాలి. ఇళ్లకే పరిమితం కావాలి. కరోనా నుంచి రక్షించుకోవడానికి ఇంతకు మించిన మార్గం లేదు. నిపుణులూ అదే చెబుతున్నారు. కరోనా వ్యాప్తి చెందడానికి ముందే దాన్ని నిలువరించాలి. దాని సాంక్రమిక వృత్తాన్ని తెగ్గొట్టాలి. కొంతమంది మాత్రం.. రోగం వచ్చిన వారే సామాజిక దూరం పాటించాలనుకుంటున్నారు. అది సరికాదు. కొందరి అవివేకం.. మిమ్మల్ని, మీ కుటుంబ సభ్యులను, స్నేహితులను, దేశం మొత్తాన్ని కష్టాల్లోకి నెట్టేసే ప్రమాదం ఉంది. దీనివల్ల యావద్దేశం ఊహకందని మూల్యాన్ని చెల్లించుకోవాల్సి వస్తుంది. అందువల్ల సామాజిక దూరం నిబంధనను ప్రధాన మంత్రి నుంచి ప్రతి ఒక్కరూ పాటించాల్సిందే. కరోనా విజృంభణ ఎక్కువగా ఉన్న దేశాల్లో ప్రభుత్వాల పిలుపు మేరకు వారాల తరబడి ప్రజలు బయటికి రాలేదు.

రూ.15వేల కోట్లు కేటాయించాం

కరోనా నియంత్రణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పనిచేస్తున్నాయి. ప్రజలకు అన్నిరకాల వస్తువులు అందుబాటులో ఉంచడానికి చర్యలు తీసుకుంటున్నాం. ఈ సంకట స్థితి వల్ల పేదలకు చాలా ఇబ్బందులు వచ్చాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, పౌరసమాజం కలిసి వీరి ఇబ్బందులు తగ్గించడానికి ప్రయత్నిస్తున్నాయి. కరోనా రోగులకు సరైన వైద్యం అందించడానికి రూ.15వేల కోట్లు కేటాయించాం. అవసరమైన పరికరాలు, వ్యక్తిగత రక్షణ వస్తువులను వేగంగా సిద్ధం చేయడానికి ఈ సొమ్మును ఉపయోగిస్తాం. రోగ లక్షణాలున్నవారు డాక్టర్ల సలహా లేకుండా ఎలాంటి మందులూ వాడొద్దు.

ఇదీ చూడండి: 'దేశంలో ఏం జరిగినా ఇళ్లవద్దే ఉండండి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.