ETV Bharat / bharat

ఏప్రిల్ 20​ నుంచి ఆంక్షల సడలింపుపై క్లారిటీ!

author img

By

Published : Apr 18, 2020, 3:03 PM IST

లాక్​డౌన్​ కారణంగా దేశంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై కేంద్ర మంత్రుల బృందం చర్చించింది. వీటిని తీర్చేందుకు మంత్రిత్వశాఖలు సమన్వయంతో పనిచేయడంపై సమీక్షించింది రక్షణమంత్రి రాజ్​నాథ్​ సింగ్ నేతృత్వంలోని మంత్రుల బృందం. స్థానిక పరిస్థితుల ఆధారంగానే ఏప్రిల్​ 20 నుంచి ఆంక్షలు సడలించాలని ప్రాథమికంగా నిర్ణయించింది.

LOCKDOWN-GOM
లాక్​డౌన్

లాక్​డౌన్​ పరిస్థితులపై రక్షణ మంత్రి రాజ్​నాథ్​ సింగ్​ నేతృత్వంలోని మంత్రుల బృందం చర్చించింది. లాక్​డౌన్‌ పొడిగింపు, ఏప్రిల్‌ 20 నుంచి దేశంలోని హాట్‌స్పాట్‌ యేతర జోన్లలో పాక్షికంగా అనుతించే ఆర్థిక కార్యకాలపాలపై సమీక్షించింది.

రాజ్​నాథ్​ నివాసంలో భేటీ అయిన కేంద్ర మంత్రులు.. సడలింపులపై స్థానిక పరిస్థితుల ఆధారంగా నిర్ణయం తీసుకోవాలని అంగీకారానికి వచ్చారు. ఈ మేరకు పలు మంత్రిత్వ శాఖల నుంచి సమాచారం తీసుకున్నారు.

  • Interacted with the GoM on the COVID-19 situation. We discussed ways to mitigate the hardships faced by the people and the role ministries can play in providing relief to people.

    The guidelines to allow limited activities and the measures announced by RBI were also appreciated. pic.twitter.com/xUGfaSmV8L

    — Rajnath Singh (@rajnathsingh) April 18, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

"కరోనా పరిస్థితులపై మంత్రుల బృందంతో చర్చించాను. ప్రజలు ఎదుర్కొంటున్న కష్టాలను తీర్చేందుకు మంత్రిత్వశాఖలు ఎలాంటి పాత్ర పోషించాలన్న అంశంపై సమాలోచనలు చేశాం. పరిమిత కార్యకలాపాలకు అనుమతిస్తూ ఆర్​బీఐ ప్రకటించిన చర్యలు ప్రశంసనీయం."

- రాజ్​నాథ్ సింగ్, రక్షణ మంత్రి

వైద్య సేవలపై..

విశ్రాంత వైద్యులు, నిపుణులు, గ్రాడ్యుయేషన్‌ చివరి ఏడాదిలో ఉన్న విద్యార్థుల సేవలు ఉపయోగించుకునే విషయంలో వచ్చిన పలు సూచనలపై మంత్రుల బృందం చర్చించినట్లు తెలుస్తోంది.

ప్రజలకు విజ్ఞప్తి..

భౌతిక దూరం పాటించే విషయంలో ఇచ్చిన నిబంధనలు పాటించాలని, ప్రార్థనలు, కార్యక్రమాలకు వెళ్లవద్దని ప్రజలకు సూచించింది మంత్రుల బృందం. ఆహారం లేక ఇబ్బంది పడుతున్న వారికి చేయూత ఇవ్వడం, ఇంట్లోనే మాస్క్‌లు తయారు చేసుకోవడం వంటి ప్రధాని సూచనలు పాటించాలని విజ్ఞప్తి చేసింది.

ఈ భేటీలో కేంద్ర మంత్రులు రామ్​విలాస్ పాసవాన్​, పీయూష్ గోయల్, ధర్మేంద్ర ప్రధాన్​, ప్రకాశ్ జావడేకర్, రమేశ్ పొఖ్రియాల్, స్మృతి ఇరానీ, జయశంకర్​, గజేంద్ర సింగ్ శెఖావత్​, హర్​దీప్ సింగ్​ పూరీ తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి: రైతులను ఆదుకునేందుకు కేంద్రానికి స్వామినాథన్‌ సూచనలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.