ETV Bharat / bharat

దేశంలో మరో 13 మందికి కరోనా- మొత్తం కేసులు 73 - దేశంలో కరోనా బాధితులు సంఖ్య

దేశంలో మరో 13 కొత్త కరోనా కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. ఫలితంగా మొత్తం కరోనా బాధితుల సంఖ్య 73కు చేరింది.

Coronavirus cases in India rise to 73: Health Ministry
దేశంలో 73కు చేరిన కరోనా బాధితులు సంఖ్య
author img

By

Published : Mar 12, 2020, 3:36 PM IST

దేశంలో కరోనా కేసుల సంఖ్య 73కు చేరింది. తాజాగా 13 కేసులు(మహారాష్ట్రలో తొమ్మిది, దిల్లీ, ఉత్తరప్రదేశ్​, లద్దాఖ్​లో ఒక్కొక్కటి) నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది.

మొత్తం 73 మంది బాధితుల్లో 17 మంది విదేశీయులు.

రాష్ట్రాల వారీగా...

కేరళలోనే ఎక్కువ కేసులు నమోదయ్యాయి. మొత్తం 17 మంది మహమ్మారి బారిన పడ్డినట్లు ఆ రాష్ట్ర అధికారులు తెలిపారు. దిల్లీలో 6, ఉత్తరప్రదేశ్​లో 10, కర్ణాటకలో నాలుగు, మహారాష్ట్రలో 11, లద్దాఖ్​లో ముగ్గరికి పాజిటివ్​ కేసులు నమోదైనట్లు ఆరోగ్య శాఖ వెల్లడించింది. రాజస్థాన్​, తెలంగాణ, తమిళనాడు, జమ్ముకశ్మీర్​, పంజాబ్​ రాష్ట్రాల్లో ఒక్కొక్కరికి చొప్పున వైరస్ సోకినట్లు ఆయా రాష్ట్రాలు తెలిపాయి.

ఇటలీకి వైద్య బృందం....

ఇటలీలో చిక్కుకున్న భారతీయ విద్యార్థుల నమూనాలను స్వీకరించటానికి ఓ వైద్య బృందం గురువారం ఆ దేశానికి వెళ్లనున్నట్లు అధికారులు తెలిపారు. వారికి వైద్య పరీక్షలు చేసిన తర్వాత స్వదేశానికి తీసుకురానున్నట్లు స్పష్టం చేశారు. ఇప్పటికే ఇరాన్​ నుంచి ప్రత్యేక విమానం ద్వారా 58 మంది భారతీయులను స్వదేశానికి తీసుకు వచ్చింది కేంద్రం. వీరికి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు అధికారులు.

ఇదీ చూడండి:హిమాచల్​ హిమమయం- రాకపోకలకు అంతరాయం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.