ETV Bharat / bharat

దిల్లీపై మర్కజ్​ పిడుగు- ఒక్క రోజులో 141 కొత్త కేసులు - DELHI CORONA VIRUS CASES

దిల్లీలో కరోనా వైరస్​ కేసుల సంఖ్య ఒక్క రోజులో భారీగా పెరిగింది. 141 కొత్త కేసులు నమోదయ్యాయి.

Coronavirus cases in Delhi go up to 293; two more deaths: Authorities
దిల్లీలో ఒక్క రోజులో 141 కొత్త కేసులు
author img

By

Published : Apr 2, 2020, 9:40 PM IST

నిజాముద్దీన్​ తబ్లీగీ జమాత్​ వ్యవహారం దిల్లీలో కరోనా కేసులు ఒక్కసారిగా పెరిగేందుకు కారణమైంది. ఒక్క రోజులోనే 141 కొత్త కేసులు నమోదయ్యాయి. ఇద్దరు మరణించారు. ఫలితంగా దిల్లీలో మొత్తం బాధితుల సంఖ్య 293కు, మృతుల సంఖ్య 4కు చేరింది.

152 నుంచి 293కు...

బుధవారం రాత్రి వరకు దిల్లీలో కరోనా బాధితుల సంఖ్య 152 మాత్రమే. అయితే ఒక్క రోజులోనే కొత్తగా 141 కేసులు నమోదయ్యాయి. ఇందులో 129 మంది మర్కజ్​ వ్యవహారంతో సంబంధమున్నవారే.

దిల్లీలోని మొత్తం 293 మంది బాధితుల్లో 182 మంది గత నెలలో జరిగిన నిజాముద్దీన్​ జమాత్​ ప్రార్థనల్లో పాల్గొన్న వారేనని దిల్లీ ఆరోగ్య శాఖ తెలిపింది.

దేశంలో ఇలా...

దేశంలో కరోనా కేసులు 2069కి చేరినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ ప్రకటించింది. ఇందులో 1860 యాక్టివ్​ కేసులున్నట్లు స్పష్టం చేసింది. మరో 156 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకోగా.. 53 మంది మరణించారు.

ఇదీ చూడండి:- మహారాష్ట్రలో ఒక్కరోజే 81 కేసులు.. తమిళనాడులో 75

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.