ETV Bharat / bharat

మానసిక ఒత్తిడితో కరోనా రోగి ఆత్మహత్య - కరోనాతో రాజస్థాన్​లో వ్యక్తి ఆత్మహత్య

కరోనా మహమ్మారి ప్రత్యక్షంగానే కాక.. పరోక్షంగానూ ప్రాణాలు తీస్తోంది. రాజస్థాన్​లో కొవిడ్ పాజిటివ్​గా నిర్ధరణ అయిన ఓ వ్యక్తి మానసిక ఒత్తిడికి లోనై బలవన్మరణానికి పాల్పడ్డాడు.

Corona-positive man kills self out of depression: Police
కరోనా, మానసిక ఒత్తిడితో వ్యక్తి ఆత్మహత్య
author img

By

Published : Nov 19, 2020, 5:20 AM IST

రాజస్థాన్​లోని జోధ్​పుర్​లో.. కరోనా సోకి గృహ నిర్బంధంలో ఉన్న ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. వైరస్​తో మానసిక ఒత్తిడికి లోనుకావడం వల్లే.. బలవన్మరణానికి పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు.

ఇదీ జరిగింది..

36ఏళ్ల శ్రామిత్ మాలి ఇటీవలే కొవిడ్ బారినపడ్డారు. వైద్యుల సూచన మేరకు ఐదు రోజులుగా గృహ నిర్బంధంలో ఉన్నాడు. అయితే గత కొంతకాలంగా భార్యతో శ్రామిత్​కు కలహాలు ఉన్నట్టు తెలుస్తోంది. శ్రామిత్​ భార్య అతడ్ని వదిలేసి.. పుట్టింటికి వెళ్లిపోయింది.

ఈ నేపథ్యంలో.. ఓవైపు కరోనా, మరోవైపు భార్యతో తగాదాల వల్ల ఒత్తిడిని భరించలేక తన గదిలోనే ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు శ్రామిత్​. ఈ విషయాన్ని అతడి తండ్రి గుర్తించాడు.

సమాచారం అందుకున్న పోలీసులు.. సంఘటనా స్థలికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. అనంతరం ఆ మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు.

ఇదీ చదవండి: కోర్టుకు రూ.10కోట్ల జరిమానా చెల్లించిన శశికళ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.