దేశంలో కరోనా క్రమంగా వేగం పెంచింది. ప్రజలు భయాందోళనతో బిక్కుబిక్కుమంటూ జీవనం సాగిస్తున్నారు. దేశంలో కేసుల సంఖ్య 18,985కు చేరగా మరణాల సంఖ్య 603కు పెరిగింది.
కరోనా ప్రభావం ఇలా..
- రాజస్థాన్‌లో మంగళవారం మరో 83 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇందులో 63 కేసులు జైపుర్‌కు చెందినవే. ఇప్పటివరకు రాష్ట్రంలో 1,659 మంది మహమ్మారి బారిన పడ్డారు. 25 మంది వైరస్‌కు బలికాగా.. జైపుర్‌లో 13 మంది మరణించారు.
- కర్ణాటకలో 80 ఏళ్ల వ్యక్తి కరోనాకు బలయ్యాడు. రాష్ట్రంలో వైరస్ కారణంగా మరణించిన వారి సంఖ్య 17కు చేరింది. ఈరోజు మరో 7 కేసులు నమోదు కాగా కొవిడ్ బాధితల సంఖ్య 415కు పెరిగింది.
- గుజరాత్లో మెత్తం కరోనా కేసులు 2 వేలు దాటిపోయాయి. నేడు కొత్తగా 127 మందికి ఈ మహమ్మారి సోకింది. మరో ఆరుగురు మరణించగా.. మృతుల సంఖ్య 77కు చేరింది.
- ఉత్తర్‌ప్రదేశ్‌లో మొత్తం కొవిడ్ కేసుల సంఖ్య 1,294కు పెరిగనట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం 1,131 యాక్టీవ్ కేసులున్నాయని పేర్కొన్నారు. 140 మంది వైరస్‌నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయినట్లు వివరించారు.
- మహారాష్ట్రలో కరోనా ప్రభావం తీవ్రంగా ఉంది. మృతులు, కేసుల జాబితాలో దేశంలో మహారాష్ట్ర అగ్రస్థానంల ో కొనసాగుతోంది. మొత్తం 232 మంది వైరస్‌తో ప్రాణాలు కోల్పోయారు.