ఒకే కాలేయంతో ఉదర భాగం అతుక్కుని పుట్టిన కవల పిల్లల్ని శస్త్రచికిత్స చేసి విజయవంతంగా విడదీశారు ముంబయికి చెందిన ఓ ఆసుపత్రి వైద్యులు. ఇప్పుడా పిల్లల ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది.
ఏం జరిగింది?
డిసెంబర్ 21న అవిభక్త కవలలకి ముంబయిలోని బీజే వాడియా ఆసుపత్రిలో మహిళ జన్మనిచ్చింది. ప్రసవానికి ముందు చేసిన సాధారణ స్కానింగ్‌లోనే కవల పిల్లలను గుర్తించారు. మరో స్కానింగ్‌లో వారిద్దరు అతుక్కుని ఉన్నారని, పైగా ఇద్దరికీ ఒకే కాలేయం, పేగులు ఉన్నాయని తేలింది. శస్త్రచికిత్స ద్వారా వారిని వేరు చేయడం కష్టమని, చేసినా పిల్లలు చనిపోయే ప్రమాదం ఉందని వైద్యులు భావించారు.
అయినప్పటికీ 14 రోజుల తర్వాత ఆపరేషన్ చేశారు. 6 గంటలు తీవ్రంగా శ్రమించి కవలల్ని విజయవంతంగా వేరు చేశామని పిల్లల శస్త్ర చికిత్స వైద్యులు ప్రద్న్యా బింద్రే తెలిపారు.
విజయవంతంగా శస్త్రచికిత్స చేసి తమ పిల్లల్ని వేరు చేసినందుకు వైద్యులకు ఆ దంపతులు ధన్యవాదాలు చెప్పారు.
ఇదీ చూడండి: 'ట్రాక్టర్ ర్యాలీ'తో రైతు ఉద్యమానికి బీటలు!