దిల్లీలో రేపు(గురువారం) జరిగే నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరుకావాలని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ నిర్ణయించుకున్నారు. అలాగే యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ, పార్టీ సీనియర్ నేత గులాంనబీ ఆజాద్‌లు కూడా కార్యక్రమానికి వెళతారని కాంగ్రెస్ పార్టీ స్పష్టం చేసింది.
2019 సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయాన్ని చవిచూసింది. కేవలం 52 స్థానాలు మాత్రమే సొంతంగా సాధించగలిగింది. మరోవైపు ప్రధాన ప్రత్యర్థి భాజపా మాత్రం 303 స్థానాలను కైవసం చేసుకుని విజయకేతనం ఎగురవేసింది. వరుసగా రెండోసారి అధికార పీఠం దక్కించుకుంది.
ఇదీ చూడండి: కేంద్ర హోంమంత్రిగా అమిత్‌షా..!