పౌరసత్వ చట్ట సవరణపై ఈశాన్య రాష్ట్రాల్లో హింస చెలరేగిన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీపై తీవ్ర విమర్శలు చేశారు భాజపా అధ్యక్షుడు, కేంద్ర హోంమంత్రి అమిత్ షా. పౌర చట్టానికి వ్యతిరేకంగా హింసను ప్రేరేపిస్తోందని ధ్వజమెత్తారు.
ఝార్ఖండ్ విధాన సభ ఎన్నికల ర్యాలీలో భాగంగా ఈశాన్య రాష్ట్రాల ప్రజలకు పౌర చట్టంపై భరోసా కల్పించారు షా.
"నేను అసోం, ఇతర ఈశాన్య రాష్ట్రాల ప్రజలకు హామీ ఇస్తున్నాను. మీ సంస్కృతి, భాష, సామాజిక గుర్తింపు, రాజకీయ హక్కులకు ఎలాంటి భంగం ఏర్పడదు. మోదీ ప్రభుత్వం మీ హక్కులను రక్షిస్తుంది." - అమిత్షా, కేంద్ర హోంమంత్రి
సంగ్మాతో మాట్లాడా..
పౌరసత్వ చట్ట సవరణ సమస్యపై మేఘాలయ ముఖ్యమంత్రి కాన్రాడ్ సంగ్మాతో చర్చించినట్లు తెలిపారు షా. ఈ సమస్యకు నిర్మాణాత్మక పరిష్కారం దిశగా కృషి చేస్తామని సంగ్మాకు భరోసా కల్పించినట్లు పేర్కొన్నారు.
ఇదీ చూడండి: ప్రశాంత్ కిశోర్ 'ఆపరేషన్ దిల్లీ'- ఆప్ విజయమే లక్ష్యం!