ETV Bharat / bharat

'మోదీతో వచ్చిన నల్ల పెట్టెలో ఏముంది?' - helicopter

కర్ణాటక చిత్రదుర్గలో ఇటీవల ప్రధాని నరేంద్రమోదీ ప్రచారంలో పాల్గొన్నారు. ఆ సమయంలో మోదీ ప్రయాణించిన హెలికాప్టర్​ నుంచి బయటకు ఓ నల్లపెట్టెను తరలించారని కాంగ్రెస్​ చెబుతోంది. అందులో ఏముందో విచారణ చేపట్టాలని ఎన్నికల సంఘాన్ని డిమాండ్​ చేస్తోంది.

చిత్రదుర్గ సభ
author img

By

Published : Apr 14, 2019, 5:02 PM IST

ఆనంద్​ శర్మ, కాంగ్రెస్ అధికార ప్రతినిధి

కర్ణాటకలోని చిత్రదుర్గలో ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవలి పర్యటనపై కాంగ్రెస్ అనుమానాలను లేవనెత్తింది. నరేంద్రమోదీ వచ్చిన హెలికాప్టర్​ నుంచి తరలించిన నల్లపెట్టెలో ఏముందో చెప్పాలని ఆ పార్టీ డిమాండ్​ చేసింది. ఇలాంటి విషయాల్లో ఎన్నికల సంఘం పారదర్శకంగా వ్యవహరించాలని కాంగ్రెస్​ అధికార ప్రతినిధి ఆనంద్ శర్మ కోరారు.

"చిత్రదుర్గలో ప్రధానమంత్రి హెలికాప్టర్​ నుంచి ఓ పెద్ద నల్లపెట్టెను దించారు. ఈ పెట్టెను ప్రధాని వాహన శ్రేణిలో లేని ఓ ప్రైవేట్​ వాహనంలో పెట్టారు. వెంటనే అక్కడ నుంచి వేగంగా ఆ కారు వెళ్లిపోయింది. ఈ విషయం మా దృష్టికి వచ్చింది. ఆ దృశ్యాలు మాకు చూపించారు. కర్ణాటక పార్టీ అధ్యక్షుడు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఈ విషయంపై నిజానిజాలు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది."

- ఆనంద్ శర్మ, కాంగ్రెస్ అధికార ప్రతినిధి

చిత్రదుర్గకు ఈ నెల 12న మోదీ వచ్చినప్పుడు ఓ కెమెరాలో రికార్డయిన దృశ్యాలను కాంగ్రెస్ నేతలు బహిర్గతం చేశారు. ప్రధాని వచ్చిన హెలికాప్టర్​ నుంచి ఓ నల్లపెట్టెను నలుగురు తీసుకెళ్లి మరో వాహనంలో పెడతారు. వెంటనే ఆ వాహనం అక్కడి నుంచి వేగంగా వెళ్లిపోవడం ఆ దృశ్యాల్లో ఉంది.

ఇదీ చూడండి: ఎక్కువ మంది నేరచరితులు, కోటీశ్వరులే

Mathura (Uttar Pradesh), Apr 14 (ANI): Actor Dharmendra campaigned for his wife and Bharatiya Janata Party (BJP) MP Hema Malini in Uttar Pradesh's Mathura. Hema Malini is BJP's candidate from Mathura Parliamentary constituency. He said, "Our prayers are coming true slowly. I have been sharing love through the medium of my movies. And you people have given me way more love than that. I would like to ask you, "Would you give me my right? Would you give Hema her right?"

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.