కర్ణాటకలో కాంగ్రెస్ అధిష్ఠానం కీలక నిర్ణయాలు తీసుకుంది. శాసనసభలో మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను ప్రతిపక్షనాయకుడిగా నియమించింది. శాసనమండలిలో మాజీ మంత్రి ఎస్ఆర్ పాటిల్‌కు ప్రతిపక్షనేతగా అవకాశం కల్పించింది.
"కర్ణాటక రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు సిద్ధరామయ్యను శాసనసభలో...ఎస్ఆర్ పాటిల్‌ను శాసనమండలిలో ప్రతిపక్షనేతలుగా పార్టీ నియమించింది. ఈ నియామకాలు తక్షణం అమలులోకి వస్తాయి."- కాంగ్రెస్ ప్రకటన
సిద్ధరామయ్య.. పార్టీ అత్యున్నత నిర్ణయాత్మక సంస్థ అయిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో సభ్యుడిగా ఉన్నారు. ఆయన పార్టీకి చేసిన సేవలు అభినందనీయమని అధిష్ఠానం పేర్కొంది.
ఇదీ చూడండి: హైకోర్టులకు ఆ అధికారం ఉందో లేదో చూస్తాం: సుప్రీం