పార్టీ సామాజిక మధ్యమాల బాధ్యతలను కాంగ్రెస్ కొత్త వ్యక్తికి అప్పగించింది. గుజరాత్‌కు చెందిన రోహన్ గుప్తాను సోషల్ మీడియా విభాగానికి చీఫ్‌గా నియమించింది. ఈ మేరకు పార్టీ అధిష్ఠానం అధికారికంగా ప్రకటించింది.
మొన్నటి వరకు సోషల్ మీడియా వింగ్‌ను నడిపిన ఆ పార్టీ మాజీ ఎంపీ దివ్య స్పందన ఇటీవల తన పదవికి రాజీనామా చేశారు. ఎన్నికల ఫలితాలు విడుదలైనప్పటి నుంచి ఆమె పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఇందుకోసం ఆమె స్థానంలో కొత్త వ్యక్తిని నియమించారు. రోహన్ గుప్తా 2017లో గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఆ రాష్ట్ర కాంగ్రెస్ సోషల్ మీడియా విభాగం చీఫ్‌గా పనిచేశారు.
ఇదీ చూడండి : 'కార్టూనిస్టులకు పని కల్పిస్తోన్న ఇమ్రాన్‌ఖాన్'