సివిల్స్ ప్రిలిమినరీ పరీక్ష తేదీ ఖరారు
కరోనా మహమ్మారి విజృంభణతో వాయిదాపడ్డ సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్ష తేదీని వెల్లడించింది యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ). ఈ ఏడాది అక్టోబరు 4న నిర్వహించనున్నట్లు ప్రకటించింది.
గతేడాది సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ, మెయిన్స్ ఎగ్జామ్స్‌లో ఉత్తీర్ణులైన వారికి సంబంధించిన పర్సనాలిటీ టెస్ట్ పైనా స్పష్టతనిచ్చింది. ఈ పరీక్షలను జులై 20 నుంచి పునఃప్రారంభించనున్నట్లు వెల్లడించింది.
ఈ ఏడాది ప్రిలిమినరీ పరీక్ష మే 31న నిర్వహించాల్సి ఉన్నప్పటికీ దేశవ్యాప్తంగా విధించిన లాక్‌డౌన్‌తో వాయిదా పడింది. కొత్త తేదీలను ప్రకటించిన నేపథ్యంలో పరీక్షలు రద్దవుతాయనే ప్రచారానికి తెరపడినట్లయిందని పేర్కొన్నారు కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్.
ఈ ఏడాది యూపీఎస్సీ పరీక్షల షెడ్యూల్
- సెప్టెంబర్ 6న ఎన్డీఏ, ఎన్ఏ పరీక్ష
- అక్టోబర్ 4న సివిల్స్ ప్రిలిమినరీ, ఐఎఫ్ఎస్ పరీక్ష
- అక్టోబర్ 16న ఐఈఎస్, ఐఎస్ఎస్ పరీక్ష
- 2021 జనవరి 8న సివిల్స్ మెయిన్స్
- 2021 ఫిబ్రవరి 28న ఐఎఫ్ఎస్ మెయిన్స్