ETV Bharat / bharat

'అవును.. ఆ ఐదుగురు మా దగ్గరే ఉన్నారు: చైనా' - కిరణ్​ రిజిజు

అరుణాచల్ ​ప్రదేశ్​లో గల్లంతైన ఐదుగురు.. తమ వద్దే ఉన్నట్టు చైనా అంగీకరించింది. వారందరూ తమ భూభాగంలో కనిపించినట్టు వెల్లడించింది. వారిని వెనక్కి తీసుకొచ్చేందుకు చర్చలు జరుపుతున్నట్టు కేంద్రమంత్రి కిరణ్​ రిజిజు పేర్కొన్నారు.

chinas-pla-confirms-5-missing-arunachal-youths-found-kiren-rijiju
అవును.. ఆ ఐదుగురు మా దగ్గరే ఉన్నారు: చైనా
author img

By

Published : Sep 8, 2020, 5:40 PM IST

Updated : Sep 8, 2020, 5:47 PM IST

సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో అరుణాచల్​ప్రదేశ్​లో ఐదుగురు గల్లంతైన ఘటనపై ఎట్టకేలకు స్పందించింది చైనా. వారందరూ తమ భూభాగంలో కనిపించినట్టు వెల్లడించింది. భారత సైన్యానికి అందించిన సమాచారంలో చైనా సైన్యం ఈ విషయాన్ని స్పష్టం చేసినట్టు కేంద్రమంత్రి, అరుణాచల్​ప్రదేశ్​ ఎంపీ కిరణ్​​ రిజిజు వెల్లడించారు.

ఆ ఐదుగురిని వెనక్కి తీసుకొచ్చే విషయంపై చర్చలు జరుపుతున్నట్టు పేర్కొన్నారు రిజిజు.

అయితే.. ఆ ఐదుగురిని చైనా సైన్యం అపహరించిందని భాజపా ఎంపీ తపీర్​ గావ్​ గతంలో ఆరోపించారు. సుబాన్​సిరి జిల్లాలో కస్తూరి జింకలను వేటాడేందుకు వెళ్లిన వీరిని మెక్​మోహన్​ రేఖ వద్ద చైనా సైన్యం పట్టుకుందని వెల్లడించారు.

ఇదీ చూడండి:- 'భారత్‌ మమ్మల్ని తక్కువ అంచనా వేస్తోంది'

Last Updated : Sep 8, 2020, 5:47 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.