ETV Bharat / bharat

చైనా వక్ర బుద్ధి: ఇటు చర్చలు- అటు కుట్రలు! - India and China standoff

భారత్​-చైనా సరిహద్దుల్లో కొన్ని నెలలుగా ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. వీటిని పరిష్కరించడానికి ఇప్పటికే పలు దఫాలుగా ఇరుదేశాల మధ్య చర్చలు జరిగాయి. ఈ తరుణంలో ఓవైపు చర్చలు జరుపుతూనే మరోవైపు సరిహద్దుల్లో యుద్ధప్రాతిపదికన మౌలిక సదుపాయలను అభివృద్ధి చేస్తోంది చైనా​. ఇందులో భాగంగా లద్దాఖ్​ నుంచి సిక్కిం వరకు రాడార్లను ఏర్పాటు చేస్తోందని ఉన్నతాధికారులు తెలిపారు.

China rapidly upgrades, installs radars along LAC with India
ఇటు చర్చలు- అటు కుట్రలు!
author img

By

Published : Nov 22, 2020, 11:27 AM IST

చైనాతో సరిహద్దుల్లో ఎనిమిది నెలలుగా ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఓ వైపు చర్చలంటూ... మరోవైపు సరిహద్దుల్లో మౌలిక సదుపాయాలను త్వరితగతిన అభివృద్ధి చేస్తోంది పొరుగు దేశం​. లద్దాఖ్​ నుంచి సిక్కిం వరకు 3,488కిలోమీటర్లు పొడవున రాడార్​ వ్యవస్థ అభివృద్ధిని వేగవంతం చేసిందని ఉన్నతాధికారులు వెల్లడించారు.

అధికారులు తెలిపిన ఇతర అంశాలు...

  • యెచెంగ్​ వద్ద ఓ మధ్యస్థాయి భవనం, వాచ్​టవర్​ను చైనా నిర్మిస్తోంది. సరిహద్దులో నిఘా వ్యవస్థను బలోపేతం చేసేందుకు రాడార్​ల సంఖ్యను మూడు నుంచి నాలుగుకు పెంచింది. ఇప్పటికే జేవై-26, హెచ్​జీఆర్​-105, జేఎల్​సీ-88బీ రాడార్లు ఉండగా... కొత్తగా మరొక రాడార్​ను ఏర్పాటు చేసింది.
  • సిక్కింకు సమీపంలోని పాలీ, ఫారీ క్యారాంగ్​ లా ప్రాంతానికి రెండు కిలోమీటర్లు దూరంలో రాడార్​సైట్​ను​ ఏర్పాటు చేసింది. అందులో నాలుగు రాడార్లు ఉన్నాయి.
  • సెంట్రల్​ భూటాన్​కు సమీపంలో యాండార్క్​ త్సో వద్ద నిఘా సదుపాయాలను అభివృద్ధి చేసింది.
  • త్సోనాకు ఈశాన్యంగా ఆరు కిలోమీటర్ల దూరంలో క్యూనా ఎలక్ట్రానిక్​ వార్ఫేర్​ స్టేషన్ ఉంది. ఈ సైట్‌లో మూడు రాడోమ్‌లు, మూడు రాడార్లు, ఐదు భవనాలు ఉన్నాయి.
  • అరుణాచల్​ ప్రదేశ్​ సమీపంలో లింజి, నిగిటి వద్ద కూడా రాడార్​​ వ్యవస్థను ఏర్పాటు చేసింది.
  • కారాకోరం కనుమలో వివాదాస్పద ప్రదేశమైన రెచిన్​ లా సమీపంలో మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేసింది చైనా. మోడల్​ గ్రామాలుగా పిలిచే శాశ్వత ఇంటిగ్రేటెడ్ నివాసయోగ్యమైన మౌలిక సదుపాయాలను కూడా నిర్మిస్తోంది. వాస్తవాధీన రేఖ అంతటా ఇటువంటి గ్రామాలు గుర్తించాం.

సరిహద్దు వివాదాలను శాంతిపూర్వకంగా చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని ఇరు దేశాలు భావిస్తున్నాయి. దీనిలో భాగంగా ఇప్పటికే 8 సార్లు కమాండర్​ స్థాయి, దౌత్య స్థాయి చర్చలు జరిగాయి. అయినా ఎటువంటి ఫలితం లేదు. త్వరలో తొమ్మిదో దఫా చర్చలకు షెడ్యూల్​ ఖరారు కానుంది.

ఇదీ చూడండి: బిహార్​లో ఎన్​కౌంటర్​- ముగ్గురు నక్సల్స్ హతం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.