ETV Bharat / bharat

16 ఏళ్ల బాలుడికి, 19 ఏళ్ల అమ్మాయికి బలవంతపు పెళ్లి - బలవంతపు పెళ్లి

బెంగళూరులోని అరకేరేలో జరిగిన ఓ బాల్యవివాహం ఆలస్యంగా వెలుగుచూసింది. దగ్గరి బంధువులు 16 ఏళ్ల బాలుడికి, 19 ఏళ్ల అమ్మాయికి బలవంతంగా పెళ్లి చేశారు. ఓ ఎన్​జీఓ ఫిర్యాదులో రంగంలోకి దిగిన పోలీసులు బాలుడ్ని, అమ్మాయిని చట్టం ప్రకారం వేరుచేశారు. బాధ్యులపై కేసులు నమోదుచేశారు.

16 year old boy and 19 year old girl got married forcefully
16 ఏళ్ల బాలుడికి, 19 ఏళ్ల అమ్మాయికి బలవంతపు పెళ్లి
author img

By

Published : Feb 22, 2020, 4:25 PM IST

Updated : Mar 2, 2020, 4:46 AM IST

పదహారేళ్ల బాలుడికి, 19 ఏళ్ల అమ్మాయికి బలవంతంగా పెళ్లి చేసిన ఘటన బెంగళూరులోని మైకో లేఅవుట్​ అరకేరేలో జరిగింది. కర్ణాటకలో వారం రోజుల క్రితం జరిగిన ఈ తంతు.... ఓ ఎన్​జీఓ పోలీసులకు ఫిర్యాదు చేయడం వల్ల వెలుగులోకి వచ్చింది.

స్వచ్ఛంద సంస్థ సభ్యుల సమాచారంతో పుట్టెనహళ్లి పోలీసులు బాలుడి నివాసానికి వెళ్లారు. తల్లిదండ్రులను విచారించి బాల్యవివాహం గురించి తెలుసుకున్నారు. తరువాత చట్టం ప్రకారం ఈ వధూవరులను వేరుపరిచారు.

బాల్యవివాహాల నిషేధ చట్టాన్ని ఉల్లంఘించి ఈ వివాహం జరిపించిన వధూవరుల తల్లిదండ్రులు, బంధువులపై పుట్టెనహళ్లి పోలీసులు కేసు నమోదుచేశారు.

అసోంకు చెందిన ఈ రెండు కుటుంబాల వారు 20 ఏళ్లుగా బెంగళూరులో ఉంటున్నారు. వీరు దగ్గరి బంధువులు కూడా. అమ్మాయికి తల్లిదండ్రులు లేరు. ఆమె ప్రస్తుతం అత్తతో కలిసి ఉంటోంది.

ఇదీ చూడండి: 'దేశ ఖ్యాతి పెరుగుతుంటే కాంగ్రెస్​కు బాధ ఎందుకో?'

Last Updated : Mar 2, 2020, 4:46 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.