ETV Bharat / bharat

గన్స్​ కోసం ఫ్యాక్టరీ పెట్టిన నక్సల్స్​- పోలీసుల రైడ్

ఒడిశా మల్కన్​గిరిలో మావోయిస్టులకు చెందిన ఆయుధ (తుపాకీ) కర్మాగారాన్ని ఛత్తీస్​గఢ్ పోలీసులు గుర్తించారు. ఓ మావోయిస్టు సానుభూతిపరుడిని కూడా అదుపులోకి తీసుకున్నారు. రెండు మజిల్ లోడింగ్ గన్స్, 10 బారెల్స్ ఆఫ్ గన్స్​, గన్​ బట్స్​, ఆయుధాల తయారీకి వాడే పనిముట్లు స్వాధీనం చేసుకున్నారు.

author img

By

Published : May 31, 2020, 4:39 PM IST

Chhattigarh police bust Maoist gun factory in Odisha, one held
మావోయిస్టు తుపాకీ కర్మాగారంపై పోలీసులు రైడ్

ఒడిశా మల్కన్​గిరి జిల్లాలో నక్సలైట్లు ఏకంగా ఓ ఆయుధ కర్మాగారాన్నే నిర్మించుకున్నారు. దీనిపై విశ్వసనీయ సమాచారం అందుకున్న ఛత్తీస్​గఢ్ సుక్మా జిల్లా పోలీసులు చాలా చాకచక్యంగా వ్యవహరించి ఆ ఫ్యాక్టరీని గుర్తించారు. ఓ నక్సల్ సానుభూతిపరుడిని అదుపులోకి తీసుకున్నారు.

"సుక్మా జిల్లా గాడిరాస్ పోలీసు స్టేషన్​ పరిధిలోని రాసవయ గ్రామానికి సమీపంలో 40 ఏళ్ల మాద్వి జోగా అనే నక్సలైట్​ను అరెస్టు చేశాం. అతను ఇచ్చిన సమాచారం ఆధారంగానే ఆయుధ కర్మాగారాన్ని గుర్తించాం."

- శలాబ్​ సిన్హా, సుక్మా పోలీసు సూపరింటెండెంట్​

కాటేకాలియన్ ప్రాంతంలోని మావోయిస్టు కార్యక్రమాల్లో మాద్వి జోగాది కీలక పాత్ర. గత 7-8 ఏళ్లుగా అతను నిషేధిత (సీపీఐ) నక్సలైట్లతో కలిసి పనిచేస్తున్నాడు. ఒడిశా మల్కన్​గిరి జిల్లాలోని భాస్రిగూడకు చెందిన నక్సల్ సానుభూతిపరుడు జగన్నాథ్ బర్నాయ్ నడిపే కర్మాగారంలో నాటు తుపాకులు చేయించి, మావోయిస్టులకు సరఫరా చేసేవాడు. ఇప్పటికే వీరు 35 మజిల్ లోడింగ్ తుపాకులను నక్సలైట్లకు చేరవేసినట్లు పోలీసులు గుర్తించారు.

బర్నాయ్​ను చాకచక్యంగా పట్టుకున్నారు పోలీసులు. అతడి ఇంటి నుంచి రెండు మజిల్ లోడింగ్ గన్స్, 10 బారెల్స్ ఆఫ్ గన్స్​, గన్​ బట్స్​, ఆయుధాల తయారీకి వాడే పనిముట్లు స్వాధీనం చేసుకున్నారు.

ఇదీ చూడండి: 'ఉగ్రవాదులతో పీఓకే ఫుల్​- ఏ క్షణమైనా భారత్​లోకి...'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.