Dhoom 4 Ranbir Kapoor Kiara Advani : భారత్‌లో యాక్షన్ మూవీస్ ఇష్టపడేవారిని విశేషంగా అలరించిన ఫ్రాంఛైజీ ధూమ్. బాలీవుడ్‌లో తెరకెక్కిన హెయిస్ట్ యాక్షన్ ఫిల్మ్స్‌లో ఈ చిత్రానికి విశేష ఆదరణ దక్కింది. 2004లో తెరకెక్కిన ధూమ్ చిత్రానికి ఇప్పటికే మూడు సీక్వెల్స్ కూడా వచ్చాయి. బాక్సాఫీస్ వద్ద అవన్నీ సూపర్ హిట్స్ అందుకున్నాయి. ధూమ్ 3 వచ్చి పదేళ్లు దాటి పోగా, విజయవంతమైన ఈ సిరీస్‌లో ఇప్పటివరకూ మరో సినిమాను ప్రకటించలేదు. అయితే ఈ ఫ్రాంఛైజీలోనే త్వరలో ధూమ్ 4 పట్టాలెక్కనున్నట్లు గత కొంత కాలంగా ప్రచారం సాగుతోంది.
దీంతో ప్రస్తుతం అందరి దృష్టి ధూమ్ 4 సినిమా పైనే ఉంది. ప్రముఖ నిర్మాణ సంస్థ యశ్ రాజ్ ఫిలింస్ దీన్ని తీర్చిదిద్దుతున్నారు. అయితే ఈ నాల్గోవ భాగంలో బాలీవుడ్ స్టార్ హీరో, యానిమల్ ఫేమ్ రణ్‌బీర్ కపూర్ ప్రధాన పాత్రలో నటిస్తున్నట్లు కొన్ని రోజులుగా వార్తలు వస్తోన్నాయి. తాజాగా ఈ సినిమా గురించి మరో ఆసక్తికర విషయం బయటికొచ్చి చక్కర్లు కొడుతోంది.
ఈ యాక్షన్ థ్రిల్లర్ చిత్రంలో బాలీవుడ్ అందాల తారలు కియారా అడ్వాణీ, శార్వరీ వాఘ్‌లు హీరోయిన్లుగా నటించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. "ప్రస్తుతం ధూమ్ 4 స్క్రిప్ట్ వర్క్ శరవేగంగా జరుగుతోంది. ఇందులో రణ్‌బీర్ పక్కన నటించడానికి కియారా, శార్వరీలతో మూవీ టీమ్ చర్చలు జరుపుతోంది. వీరిద్దరిలో ఒకరు పోలీసుగా, మరొకరు విలన్ పాత్రలో మెరవనున్నారట. త్వరలో పూర్తి విషయాల్ని అధికారికంగా వెల్లడించనున్నారు." అని రణ్‌బీర్ సన్నిహిత వర్గాలు పేర్కొన్నాయి. మరి ఈ అందాల భామలతో రణ్‌బీర్ చేసే సందడి ఎలా ఉంటుందో తెలియాలంటే ఇంకొన్ని రోజులు వేచి చూడాల్సిందే.
Dhoom 4 Suriya : ఇకపోతే ఈ చిత్రంలో కోలీవుడ్ స్టార్ హీరో సూర్య కీలక పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం. సినిమాలో ముఖ్యమైన ప్రతి నాయకుడి పాత్రలో సూర్య నటించనున్నారని, ఈవిషయంపై ఇప్పటికే మూవీ టీమ్ ఆయన్ను సంప్రదించినట్లు వార్తలు వచ్చాయి. ఈ పాత్రలో నటించేందుకు సూర్య కూడా ఆసక్తి చూపారని టాక్.
సాయి పల్లవి అలా పిలిచినందుకు ఫీలయ్యా : శివకార్తికేయన్
సంక్రాంతి 'గేమ్ ఛేంజ్' - పండగ బరిలో ఏఏ సినిమాలు వస్తున్నాయంటే?